College Student Gang-Raped In Front Of Boyfriend In Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగుడు. కాంచీపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. యువకుడు, అమ్మాయి క్లాస్ మేట్స్. వీరిద్దరు ఏకాంతంగా గడిపేందుకు ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లారు. ఇది గమనించిన దుండగులు యువకుడిని కొట్టి, కత్తితో బెదిరించి, 20 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
Peddi Sudarshan Reddy comments: తెలంగాణ ప్రభుత్వం సాగు, తాగు నీటి సౌకర్యాలను కల్పించిందని..దీంతో తెలంగాణ వ్యాప్తంగా పంటల దిగుబడి పెరిగిందని, వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా గోదావరి జలాలతో పంటల దిగుబడి గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. సంక్రాంతి పండగ సందర్భంగా నర్సంపేటలో శాంతిసేన రైతు సంఘం నిర్వహించిన పశువుల అందాల పోటీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ISRO scientist Nambi’s arrest was illegal, 1994 espionage case was false, CBI informs Kerala HC: ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ పై గూఢచర్యం కేసు అబద్ధం అని అతడి అరెస్ట్ చట్ట విరుద్ధం అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( సీబీఐ ) కేరళ హైకోర్టుకు శుక్రవారం స్పష్టం చేసింది. 1994లో ఇస్రో శాస్త్రవేత్త అయిన నంబి నారాయణ్ పై గూఢచర్యం కేసు నమోదు అయింది. ఈ కేసులో నంబి నారాయణ్ నిరుపరాధి అని తేలింది. అయితే…
Declining population in China: చైనాలో 2022లో తక్కువ జనాభాను నమోదు చేస్తుందని జనాభా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 1961లో మహా కరువు తర్వాత 2022లో తొలిసారిగా చైనాలో జనాభా తగ్గదల కనిపించింది. 2022లో చైనాలో కొత్త జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే.. 2022లో శిశువుల జననాలు 10 మిలియన్ల కన్నా తక్కువగా నమోదు అయ్యాయి. అంతకుముందు ఏడాది 10.6 మిలియన్ల శిశువులు జన్మించారు. 2020తో పోలిస్తే 11.5 శాతం తక్కువగా జననాలు నమోదు అయ్యాయి.
Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 31 నుంచకి ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ జరగబోతున్నాయి. 27 సమావేశాలు, 66 రోజుల పాటు జరుగుతాయిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోెషి తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాజ్యసభ, లోక్ సభ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర బడ్జెట్ , ఇతర అంశాలపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చల కోసం…
Anti-Pak protests intensify in PoK as Gilgit Baltistan demands reunion with India: పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ సర్కార్ కు వ్యతిరేకంగా భారీగా ర్యాలీలు, నిరసనలు తెలుపుతున్నారు. మేం భారతదేశంలో కలుస్తామని నినదిస్తున్నారు. తన ప్రాంతాన్ని దోపిడి చేసి పంజాబ్, సింధ్ ప్రాంతాలకు పెడుతున్నారంటూ పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే), గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఆందోళన వీడియోలు…
Mehul Choksi: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఇండియాలో పలు బ్యాంకులకు టోకరా పెట్టి విదేశాలకు పారిపోయారు. అయితే అప్పటి నుంచి అతడిని ఇండియాకు రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కు పాల్పడిన మెహుల్ చోక్సీ 2018లో దేశం వదలి పారిపోయాడు. ఇతడిపై ఇంటర్ పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. ఇదిలా ఉంటే మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఆంటిగ్వా దేశంలో ఉన్న ఆయన అక్కడి అధికారులకు పెద్ద ఎత్తున లంచాలను…
Kerala man murders wife, buries her at home in Ernakulam: కేరళకు చెందిన ఓ వ్యక్తి భార్యను చంపేసి ఏడాదిన్నరగా పోలీసులను తప్పుదోవపట్టిస్తూ వచ్చాడు. తన భార్య ఎవరితోనో పారిపోయిందని చెబుతూ ఇరుగుపొరుగు వారిని, బంధువులను చివరకు పోలీసులను మభ్యపెడుతూ వచ్చాడు. తన ఇంట్లోనే చంపి పాతిపెట్టాడు. చివరకు 18 నెలల తర్వాత హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎర్నాకులంకు చెందిన సజీవ్ భార్య రమ్య ఆగస్ట్, 2021 నుంచి కనిపించకుండా పోయింది. ఫిబ్రవరి 2022లో ఎన్…
Rakhi Sawant Marriage - Taslima Nasreen comments: వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ మరోసారి ఇస్లాంపై వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం ఛాందసవాదాన్ని ఎదురించిన తస్లిమా సొంత మతం నుంచే బెదిరింపులు, దాడులకు గురైంది. ఇస్లాంలోని తప్పులను ఎత్తి చూపడంలో ముందుంటారు. ఇదిలా ఉండే ఆమె మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్ స్వాతంత్య్రం, స్త్రీల సమానత్వం, ముస్లిమేతర హక్కులు మొదలైనవాటిని అంగీకరించాలని లేకపోతే ఆధునిక సమాజంలో దీనికి స్థానం ఉండదని అన్నారు.
MP Saumitra Khan: పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ గురువారం ప్రధాని మోదీని, స్వామి వివేకనందతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరిగిన ఓ కార్యక్రమంలో స్వామి వివేకానంద మోదీ రూపంలో మళ్లీ జన్మించాడని వ్యాఖ్యలు చేశాడు. స్వామీజీ ప్రధాని మోదీగా పునర్జన్మ తీసుకున్నారని.. మాకు స్వామీజి దేవుడితో సమానం అని ఆయన అన్నారుర. ప్రధాని తన తల్లి చనిపోయినప్పుడు కూడా దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన విధానం, అతడు ఆధునిక…