5-Door Mahindra Thar: స్వదేశీ ఆటోెమేకర్ మహీంద్రా వరసగా తన కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తోంది. ఇటీవల తన ఎలక్ట్రిక్ కార్ విభాగంలో మహీంద్రా ఎస్‌యూవీ 400ను తీసుకువచ్చింది. ఇప్పటికే ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ థార్ తో సంచలనాలు నమోదు చేసింది. దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవల 4×2(ఆర్ డబ్ల్యూ డీ) థార్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు మహీంద్రా థార్ 5 డోర్ ఎస్‌యూవీని తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఉన్న 3 డోర్ థార్ తో పోలిస్తే మరింత లగ్జరీగా, మరింత పవర్ ఫుల్ గా థార్ 5 డోర్ వెహికిల్ రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే థార్ 5 డోర్ కారును పరీక్షిస్తోంది మహీంద్రా సంస్థ.
ఇండిపెండెన్స్ రోజా.. దసరాకా..?
మారుతి జిమ్ని ఇటీవల తన 5 డోర్ కారును తీసుకువచ్చింది. దీనికి పోటీగా మహీంద్రా కూడా త్వరలోనే 5 డోర్ థార్ ను ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. అయితే మహీంద్రా కొత్త థార్ ను దీపావళికి ముందు పండగ సీజన్ లో విడుదల చేసే అవకాశం ఉందని, లేకపోతే ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాటికి మార్కెట్ లోకి అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. ఎట్టకేలకు ఈ ఏడాదిలోనే మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.
ఇంజిన్ ఛాయిసెస్ ఇలా ఉండొచ్చు..
మరింత శక్తివంతంగా 5 డోర్ థార్ ఉండబోతున్నట్లు సమాచారం. పెట్రోల్, డిజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. స్కార్పియో ఎన్ పవర్ ట్రెయిన్ ఆధారంగా కొత్త థార్ ఉండొచ్చు. 2.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 2.2-లీటర్ టర్బో డీజిల్ వేరియంట్లలో థార్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఇంజిన్లు 3 డోర్ థార్, స్కార్పియో ఎన్, XUV700లో ఉన్నాయి. టర్బో పెట్రోల్ ఇంజిన్ పవర్ పరిశీలిస్తే.. 200బిహెచ్‌పి పవర్, 370-380ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. టర్బో డిజిల్ ఇంజన్ 172 బీహెచ్పీ 370 ఎన్ఎం టార్క్(మాన్యువల్ ట్రాన్స్మిషన్), 400 ఎన్ఎం టార్క్( ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్), 130 బీహెచ్పీ, 300 ఎన్ఎం శక్తితో 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమెటిక్ గా ట్రాన్స్మిషన్లు ఉన్నాయి.
డిజైన్..
కొత్త 5-డోర్ల మహీంద్రా థార్ 3-డోర్ మోడల్‌తో పోల్చితే దాదాపు 300ఎంఎం పొడవైన వీల్‌బేస్ కలిగి ఉండే అవకాశం ఉంది. స్థిరత్వం కోసం వీల్‌బేస్-టు-ట్రాక్ రెషియో కోసం చక్రాల మధ్య ట్రాక్ లేదా వెడల్పును పెంచే అవకాశం ఉంది. థార్ 3డోర్ తో పోలిస్తే 5 డోర్ లో గణనీయంగా పొడవు పెరుగుతుంది. డోర్-మౌంటెడ్ స్పేర్ వీల్, సిగ్నేచర్ గ్రిల్, రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లను కలిగి ఉంటుంది. ఇంటీరయర్ మొత్తం 3 డోర్ థార్ ను పోలి ఉండే అవకాశం ఉంది. కొన్ని కొత్త ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, సన్ గ్లాస్ హోల్డర్, రివైజ్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఉంటాయని భావిస్తున్నారు. బూట్ స్పేస్ పెరగనుంది.
జిమ్నీ, గూర్ఖాకు పోటీ..
ప్రస్తుత ఆఫ్ రోడ్ కార్లలో థార్ తో పాటు మారుతి జిమ్ని, ఫోర్స్ గూర్ఖాలు మార్కెట్ లో ఉన్నాయి. మారుతి సుజుకీ ఇటీవల 5 డోర్ జిమ్నిని లాంచ్ చేసింది. ఇక ఫోర్స్ గూర్ఖా కూడా 5డోర్ సెగ్మెంట్ లో రానుంది. ఈ రెండింటికి థార్ 5 డోర్ పోటీ ఇవ్వనుంది.