PM-KISAN: రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఈ ఆర్థిక సాయాన్ని కేంద్ర పెంచుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) కింద లబ్ధిదారులకు ప్రస్తుతం ఏడాదికి రూ.6000 ఇస్తోంది. అయితే ఈ ఆర్థిక సాయాన్ని పెంచే ప్రతిపాదన ప్రస్తుతం లేదని ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ కు తెలియజేసింది.
Rahul Gandhi criticizes BJP in Adani case: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై ఫైర్ అయ్యారు. పార్లమెంట్ లో అదానీ వ్యవహారం, అగ్నివీర్ స్కీమ్ గురించి విమర్శించారు. భారత్ జోడో యాత్ర అనుభవాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో నిరుద్యోగం, పెరిగిన ధరలు, రైతుల సమస్యలు నా దృష్టికి వచ్చాయని వెల్లడించారు. అగ్నివీర్ యోజన సైనికులు నుంచి వచ్చిన ఆలోచన, ప్రతిపాదన కాదని, ఈ ఆలోచన, ప్రతిపాదన జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ది అని అన్నారు.
Threat Call Received To Blow Up Mumbai Airport: ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. తనను తాను ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదిగా చెప్పుకుని విమానాశ్రయాన్ని పేల్చేస్తామని హెచ్చరించాడు. సోమవారం రాత్రి 10 గంటలకు ముంబై విమానాశ్రయానికి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
20 ISIS Terrorists Escape After Earthquake: టర్కీ, సిరియా ప్రాంతాల్లో వరస భూకంకపాల వల్ల తీవ్ర ప్రభావితం అయ్యాయి. వేలాదిగా ప్రజలు మరణించారు. ముఖ్యంగా 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపాల ధాటికి టర్కీ, సిరియాలు వణికిపోయాయి. పలు బిల్డింగులు మేకమేడల్లా కూలిపోయాయి. వరసగా 100కు పైగా ప్రకంపన ధాటికి ఈ రెండు దేశాలు అతలాకుతలం అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ భూకంపం ఉగ్రవాదులకు వరంగా మారింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న పలువురు ఉగ్రవాదులు తప్పించుకునిపోయారు. సిరియాలో కరుడుగట్టిన 20 మంది ఐఎసఐఎస్ ఉగ్రవాదులు…
Phulwari Sharif PFI case: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన పీఎఫ్ఐ ఉగ్రసంస్థ ఫుల్వారీ షరీఫ్ కేసులో మరో ఇద్దరిని బీహార్ లో అరెస్ట్ చేశారు. బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పిఎఫ్ఐకి చెందిన ఇద్దరు అనుమానితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బహదూర్‌పూర్ గ్రామానికి చెందిన తన్వీర్ రజా అలియాస్ బర్కతి, మహ్మద్ అబిద్ అలియాస్ ఆర్యన్ అనే ఇద్దరు వ్యక్తులను మోతిహరీ ప్రాంతంలో ఎనిమిది చోట్ల దాడులు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిద్దరు టార్గెటెడ్ కిల్లింగ్స్…
Ramdev Charged For Hate Speech: ముస్లింలపై విద్వేషవ్యాఖ్యలు చేసిన ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ పై కేసు నమోదు అయింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన కార్యక్రమంలో రామ్‌దేవ్ బాబా ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగానికి పాల్పడ్డారు. దీనిపై స్థానికంగా ఉండే పథాయ్ ఖాన్ చౌహతాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.
Rishi Sunak May Exit Human Rights Treaty To Push Immigration Plan: యూకే ప్రధాని రిషి సునాక్ ఇమ్మిగ్రేషన్ ప్రణాళికను ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అవుతున్నారు. దేశంలో అక్రమ వలసలను అరికట్టేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం నుంచి వైదొలగనున్నారు. వలసదారుల రాకపోకలను అరికట్టేందుకు రిషి సునాక్ యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్ (ఇసిహెచ్ఆర్) నుండి వైదొలగేందుకు సిద్ధమయ్యారని సండే టైమ్స్ నివేదించింది.
Huge blast in Pakistan's Quetta: పాకిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో పోలీసులు, సైనికులు టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల పెషావర్ లో మసీదులో పేలుడు ఘటన మరవక ముందే మరోసారి బాంబు పేలుడు జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోని చెక్ పాయింట్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
Paskistan Economic Crisis: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది దాయాది దేశం పాకిస్తాన్. పతనం అంచుకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటిస్తే తప్పా.. పాక్ సంక్షోభం నుంచి బయటపడటం కష్టం. అయితే ఐఎంఎఫ్ షరతులకు పాకిస్తాన్ అంగీకరిస్తేనే అప్పు వస్తుంది. పాకిస్తాన్ 1.1 బిలియన్ డాలర్ల సాయం కోసం ఐఎంఎఫ్ తో చర్చలు జరుపుతోంది. ఇటీవల ఈ షరతుల గురించి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ఐఎంఎఫ్ షరతులు ఊహకు అందనివిగా ఉన్నాయి, కానీ వాటికి తలొగ్గాల్సిందే అంటూ…
Centre likely to hike dearness allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్రం. మరోసారి ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్(డీఏ) పెంచే అవకాశం ఉంది. త్వరలోనే మరో 4 శాతం డీఏను పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 38శాతం డీఏ ఉంది.