Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇండియాపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. భారతదేశం అమెరికా వస్తువులపై తన సుంకాలను సున్నాకు తగ్గించడానికి ఆఫర్ చేసిందని, అయితే న్యూఢిల్లీ కొన్ని ఏళ్లకు ముందే ఈ పని చేయాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని సోమవారం ట్రంప్ అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంపై 25 శాతం పరిస్పర సుంకాలను విధించడంతో పాటు, రష్యా చమురు కొంటున్నామనే కారణంగా మరో 25 శాతం మొత్తంగా 50 శాతం సుంకాలనున విధించింది. ఇది…
Donald Trump: తాను చేస్తే న్యాయం, అదే ఇతరులు చేస్తే అన్యాయం అన్న రీతిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. అమెరికా రష్యాతో వ్యాపారం చేసుకోవచ్చు, కానీ భారత్ చేస్తే మాత్రం అది ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చడం అని విమర్శిస్తోంది. ఇదే కారణం చెబుతూ ట్రంప్, భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించారు. అయితే, అంతటితో ఆగకుండా తాను చేస్తున్న పనినే మీరు చేయాలంటూ పలు దేశాలకు అమెరికా సూచిస్తోంది. ఇందతా చూస్తుంటే ‘‘తాను చెడిన కోతి వనమంతా చెరిచింది’’ అనే…
Brain Infection: కేరళను అరుదైన ‘‘బ్రెయిన్ ఇన్ఫెక్షన్’’ భయపెడుతోంది. ‘‘అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’’గా పిలిచే ‘‘మెదడును తినే అమీబా’’ కారణంగా మరో ఇద్దరు మరణించారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడు నెలల శిశువుతో సహా ఇద్దరు వ్యక్తులు ఈ అరుదైన వ్యాధికి బలైనట్లు ఆరోగ్య అధికారులు సోమవారం తెలిపారు. దీంతో ఈ ప్రాణాంతక వ్యాధితో మరణించిన వారి సంఖ్య ఆగస్టు నాటికి 3కు చేరింది.
Pakistan PM: చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి డ్రాగన్ కంట్రీ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది. మోడీతో పుతిన్, జిన్‌పింగ్ దైపాక్షిక చర్చలు ప్రపంచవ్యాప్తంగా మీడియా హైలెట్ చేసింది. ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాల తర్వాత, భారత్, చైనాల మధ్య స్నేహ బంధం బలపడుతోంది. దీంతో పాటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోడీ భేటీని కూడా అంతర్జాతీయ మీడియా హైలెట్ చేసింది.
CBI: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వద్ద పెండింగ్‌లో 7,072 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తాజాగా విడుదలైన కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 31, 2023 నాటికి ఈ కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 379 హైప్రొఫైల్ కేసులు ఉన్నట్లుగా చెప్పింది. ఇవి 20 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం కేసుల్లో 1,056 కేసులు దర్యాప్తు దశలో ఉండగా, మిగతా 6,016 కేసులు వివిధ కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. ఈ […]
Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం ఓటర్లను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ‘‘త్వరలో ఓటు చోరిపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ ద్వారా బీహార్‌లో ఓటర్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు అధికార బీజేపీ, ఎన్నిక సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 65 లక్షల మంది ఓటు హక్కును అక్రమంగా తొలగించారంటూ రాహుల్ గాంధీ గతంలో…
Putin: చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న 25వ షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత మోడీ, చైనాలో పర్యటిస్తున్నారు. ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాల తర్వాత, ఈ సమావేశం జరుగుతుండటంతో ప్రపంచ దృష్టి అంతా ఈ సమావేశాలపైనే ఉంది.
US: డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు భారత్, రష్యాను మరింత దగ్గర చేయడమే కాకుండా, చైనాతో భారత స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాలా చేసింది. చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో మోడీతో పుతిన్, జిన్‌పింగ్‌లు భేటీ అయ్యారు. అయితే, ఈ పరిణామాలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కి ఎక్కడా లేని కోపాన్ని తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది.
USA: చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. రష్యా అధినేత పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికా, భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంతో ఈ మూడు దేశాలు మరింత దగ్గర అవుతున్నాయి. పుతిన్, జిన్‌పింగ్‌లతో మోడీ కరచాలనం, ఆత్మీయ ఆలింగనం చూస్తే అమెరికాకు కాలుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, భారత్ తమ నుంచి […]
Love Jihad: మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ ఇస్లాంలోకి మారలేదని, పెళ్లికి నిరాకరించిందని ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన నవారాలోని నేపానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 35 ఏళ్ల మహిళ ఇస్లాంలోకి మారాలని, తనను హింసించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు ఈ దారుణహత్య జరిగింది.