Love Jihad: మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ ఇస్లాంలోకి మారలేదని, పెళ్లికి నిరాకరించిందని ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన నవారాలోని నేపానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 35 ఏళ్ల మహిళ ఇస్లాంలోకి మారాలని, తనను హింసించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు ఈ దారుణహత్య జరిగింది.
బాధితురాలు భాగ్యశ్రీ నామ్‌దేవ్ ధనుక్‌పై షేక్ రయీస్(42) ఆమె ఇంట్లోనే దాడి చేసి, గొంతపై విచక్షణారహితంగా అనేక సార్లు పొడిచాడు, ఆమె అక్కడికక్కడే మరణించింది. కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘రయీస్ ఆమె జుట్టును పట్టుకుని, కొట్టి, వేధించేవాడు. అతను చాలా కాలంగా వివాహం,మత మార్పిడి కోసం ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. నా సోదరి నిరాకరించింది, దీంతో అతను రాత్రిపూట ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు కోసాడు’’ అని ఆమె సోదరి సుభద్ర బాయి వెల్లడించింది.
నిందితుడిపై హత్య నేరం మోపినట్లు ఏఎస్పీ అంతర్ సింగ్ కనేష్ చెప్పారు. ఈ సంఘనట హిందూ సమాజంలో ఆగ్రహానికి కారణమైంది. ‘‘లవ్ జిహాద్’’ కేసుగా అభివర్ణిస్తూ నిరసనకారుల తరుపున వాదిస్తున్న అమిత్ వరుడే ఆరోపించారు. మూడు రోజుల క్రితమే పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసినా కూడా, చర్యలు తీసుకోలేదని, పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. ప్రస్తుతం, నిందితుడి ఆక్రమణలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.