India-US Relations: భారతదేశంపై ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ట్రంప్ 50 శాతం సుంకాలను విధించారు. దీనిపై అమెరికాలోనే వ్యతిరేకత వస్తోంది. భారత్ వంటి మిత్రదేశాన్ని దూరం చేసుకుంటోందని ట్రంప్ పరిపాలను అమెరికా నిపుణులు తిట్టిపోస్తున్నారు. అయితే, ఇప్పుడు భారత్‌కు మరో అనూహ్య మద్దతు లభించింది. భారతదేశంపై అమెరికా అధికారులు విమర్శలు పెంచుతున్న నేపథ్యంలో, వీటిని ఆ దేశంలోని యూదుల కమిటీ ఖండించింది.
Vikram 3201: భారత్ పూర్తిగా స్వదేశీ అయిన 32-బిట్ మైక్రోప్రాసెసర్ ‘‘విక్రమ్’’ను ఆవిష్కరించింది. ప్రస్తుత డిజిటల్ యుగంతో మైక్రోప్రాసెసర్లకు చాలా డిమాండ్ ఉంది. ప్రతీ రంగంలో ఇవి కీలకంగా మారాయి. ఇప్పుడు ఈ రంగంలోకి భారత్ సగర్వంగా ఎంట్రీ ఇచ్చింది. చైనాలో జరిగిన ఎస్సీఓ సమావేశం నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన ప్రధాని మోడీ ఈ మైక్రోచిప్‌ని మంగళవారం ఆవిష్కరించారు. వీటిని ‘‘డిజిటర్ వజ్రాలు’’గా ప్రధాని పిలిచారు. డిజిటల్ యుగంలో ప్రపంచంలో మైక్రోప్రాసెసర్ల ప్రాముఖ్యతను ప్రధాని మోడీ నొక్కిచెప్పారు.
2020 Delhi riots: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో కుట్రకు సంబంధించి యాక్టివిస్టులు, జేఎన్‌యూ మాజీ విద్యార్థులు అయిన ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లో పాటు మరో ఏడుగురికి ఢిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. జస్టిస్ నవీన్ చావ్లా, షాలిందర్ కౌర్‌తో కూడిన ధర్మాసనం ఈ ఇద్దరితో పాటు మొహమ్మద్ సలీమ్ ఖాన్, షిఫా ఉర్ రెహమాన్, అథర్ ఖాన్, మీరాన్ హైదర్, షాదాబ్ అహ్మద్ అబ్దుల్ ఖలీద్ సైఫీ, గుల్ఫిషా ఫాతిమా బెయిల్ పిటిషన్లను కూడా తోసిపుచ్చింది.
Tesla: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన టెస్లా కార్ల అమ్మకాలను భారతదేశంలో ప్రారంభించారు. అయితే, అనుకున్నంగా ఈ కార్లకు భారతీయుల నుంచి స్పందన రావడం లేదు. జూలై 15న అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి, తన మోడల్ Y కోసం 600 వరకు ఆర్డర్లు వచ్చినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో వింత ప్రకటనలతో ట్రోలింగ్కి గురైన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం, పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుల్లో చాలా వరదలు వస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితుల్లో వరదలకు ఒక విచిత్రమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే పాకిస్తానీలు వరద నీటిని కాలువల్లోకి వెళ్లనివ్వకుండా కంటైనర్లలో ‘‘నిల్వ’’ చేయాలని ఆయన కోరారు. ఇదే కాకుండా ‘‘వరం’’గా చూడాలని కూడా ఆయన ప్రజల్ని కోరడం గమనార్హం.
Solar storm: భూమి పైకి శక్తివంతమైన సౌర తుఫాను దూసుకు వచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. సెకనుకు 600 కి.మీ అంటే గంటకు సుమారుకుగా 21 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాను భూమిని ఢీకొట్టింది. దీని ప్రభావంతో భూమి ‘‘అయస్కాంత క్షేత్రం’’ తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు తెలిసింది. ఆగస్టు 20న సూర్యుడిపై ఉన్న AR 4199 చురుకైన ప్రాంతం నుంచి M2.7-క్లాస్ సౌర జ్వాల (solar flare) విడుదలైంది. దీని తర్వాత వెంటనే అనేక కరోననల్ మాస్ ఎజెక్షన్స్(CMEs) విడుదలయ్యాయి. ఇవి ఒకదానితో ఒకటి…
India-US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని హెచ్చరిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు, చికాగో విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయిన జాన్ మెయర్‌షీమర్, ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. ట్రంప్ పరిపాలన భారత విధానాన్ని ‘‘భారీ తప్పు’’గా అభివర్ణించారు. రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌పై సెకండరీ టారిఫ్స్ పనిచేయవని అన్నారు.
President Murmu: కర్ణాటక మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం సిద్ధరామయ్యకు మధ్య ఆహ్లాదకరమైన సంభాషణకు వేదికగా మారింది. ‘‘మీకు కన్నడ తెలుసా.?’’ అని సీఎం, రాష్ట్రపతిని ప్రశ్నించారు. ఇందుకు ఆమె ‘‘తనకు భాష తెలియదని, అయితే నేర్చుకుంటానని మాత్రం హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (AIISH) డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ సంభాషణ జరిగింది.
Snake Bite: ఒక విషాదకరమైన సంఘటనలో 41 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి శనివారం మరణించారు. తన పాదరక్షల్లో విషపూరితమైన పాము ఉందనే విషయం తెలియక, వాటిని వేసుకోవడంతో పాముకాటుకు గురయ్యాడు. దీంతో టీసీఎస్‌లో పనిచేస్తున్న మంజు ప్రకాష్ అనే వ్యక్తి మరణించారు. బాధితుడు ప్రకాష్ బెంగళూర్‌లోని రంగనాథ లేఅవుట్ నివాసి.
Donald Trump: చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం జరిపిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. మరోసారి, ట్రంప్ తన అక్కసును భారత్‌పై వెళ్లగక్కుతూ, తాను విధించిన 50 శాతం సుంకాలను మరింతగా సమర్థించుకున్నాడు. భారత్-అమెరికా సంబంధాలను ‘‘ఏకపక్ష విపత్తు’’గా అభివర్ణిస్తూ తన కోపాన్ని రెట్టింపు చేశాడు.