Rahul Gandhi: భారత సైన్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందరకు కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసుల దాఖలైంది. అయితే, ఈ కేసును కొట్టివేయాలని రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Chain Snatch: తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ మెడలో గొలుసును గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. ఢిల్లీలో ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అత్యధిక భద్రత ఉండే, విదేశీ రాయబారులు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఈ చైన్ స్నాచింగ్ జరిగింది. ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Kamal Hassan: నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణి, ‘‘సనాతన’’ భావాలను ఎదుర్కొనేందుకు విద్య ఏకైక మార్గమని అన్నారు.
Witchcraft: ఒడిశా గజపతి జిల్లాలో క్షుద్ర విద్య, చేతబడి చేస్తు్న్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని గ్రామస్తులు దారుణంగా హత్య చేశారు. 35 ఏళ్ల వ్యక్తిని చంపి, అతడి ప్రైవేట్ భాగాలు ముక్కలు చేసి, సమీపంలోని హరభంగి డ్యామ్‌లో పారేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. గ్రామస్తులు వ్యక్తి గొంతు కోసం చంపిన తర్వాత, అతడి జననేంద్రియాలు కత్తిరించి, మృతదేహాన్ని జలాశయంలో పారేశారు. పోలీసులు డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ వివాహేతర సంబంధం కుటుంబాన్ని బలి తీసుకుంది. ఈ కేసులో మహిళలో పాటు ఆమె లవర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు, మనోహర్ లోధి (45), అతని తల్లి ఫూల్రాణి (70), కుమార్తె శివాని (18), అతని 16 ఏళ్ల కుమారుడు జూలై 25-26 రాత్రి ఆత్మహత్య చేసుకుని మరణించారు.
DK Shivakumar: కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్యతో ఉన్న విభేదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి ఆశిస్తున్న డీకే, ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రంలో ప్రసంగిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో "రాజ్యాంగ సవాళ్లు" అనే శీర్షికతో AICC నిర్వహించిన కార్యక్రమంలో, గాంధీ కుటుంబాన్ని ప్రశంసించారు.
Yemen: యెమెన్ తీరంలో ఆదివారం 154 మంది వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మరణించారు. మరో 74 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వలసల సంస్థ ధ్రువీకరించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మందిని మాత్రమే రక్షించామని యెమెన్ ఆరోగ్య అధికారి అబ్దుల్ ఖాదిర్ బజమీల్ చెప్పారు.
Donlad Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె అందం గురించి ప్రశంసలు కురిపించడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. లెవిట్ ముఖం, పెదవులపై ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘ఆమె ఒక స్టార్ అయింది’’ అని ఇటీవల ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘ఆమె ముఖం, మెదడు, పెదవులు అవి కదిలే విధానం, అవి ఆమె మెషిన్ గన్లా కదులుతాయి’’ అని […]
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అదే మాటలు చెప్పారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని చెప్పుకొచ్చారు. భారత్-పాకిస్తాన్ సంఘర్షణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలను ఆపినందుకు ట్రంప్ తనకు తాను ఘనత వహించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ‘సుదీర్ఘ రాత్రి’ చర్చల తర్వాత భారత్, పాక్ ‘‘పూర్తి, తక్షణ’’ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆదివారం ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు.
USA: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకుడు విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ నిధులు సమకూరుస్తోందని ట్రంప్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే స్టీఫెన్ మిల్లర్ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ పరిపాలన ఒత్తిడి తీవ్రతరం చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.