PM Modi: భారత్-యూరోపియన్ యూనియన్(ఈయూ) నేతలతో ప్రధాని నరేంద్రమోడీ గురువారం మాట్లాడారు. భారత్-ఈయూ సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌తో సంయుక్త టెలిఫోన్ కాల్ నిర్వహించారు.
US Media: ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోడీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఏడేళ్ల తర్వాత ప్రధాని మోడీ చైనాలో పర్యటించారు. దీంతో, చైనా కూడా మోడీ రాకకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో మోడీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ముగ్గురు ప్రపంచ నేతల కలయిక ‘‘సరికొత్త ప్రపంచ క్రమాన్ని’’ ఏర్పాటు చేస్తుందని అంతర్జాతీయంగా […]
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానురీతిలో పలు దేశాలపై సుంకాలు విధించడాన్ని ఇటీవల అమెరకన్ ఫెడరల్ అప్పీల్ కోర్టు తప్పు పట్టింది. అయితే, ఈ తీర్పును ట్రంప్ సర్కార్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతోంది. కోర్టులో పిటిషన్ వేసిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ఈ సుంకాలను ఉక్రెయిన్ యుద్ధంలో భారత్‌ని లింక్ చేసింది. ‘‘ఉక్రెయిన్‌లో శాంతి కోసం మా ప్రయత్నంలో కీలకమైన అంశం’’ అని సుంకాలను సమర్థిస్తూ వాదించింది.
Pakistan: పాకిస్తాన్‌కి చైనా షాక్ ఇచ్చింది. చైనా పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్ట్‌ని, తమ దేశంలోని జిన్జియాంగ్ ప్రావిన్సులను కలుపుతూ రోడ్డు, రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)లో భాగంగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC) చేపట్టింది. ఇప్పటికే బలూచిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టును డెవలప్ చేసింది.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా, ట్రంప్ వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలకు మద్దతుగా నిలిచారు. ఈ రెండు దేశాలను యూఎస్ ఆంక్షల పేరుతో బెదిరించలేదని అన్నారు. చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ అనంతరం మీడియాతో మాట్లాడిన పుతిన్..
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో బదులు తీర్చుకుంది. అయితే, భారత్ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేసినా, పాక్ ఆర్మీ కవ్వించిన సంగతి తెలిసిందే. పాక్ ఆర్మీ భారత జనావాసాలు, సైనిక స్థలాలను టార్గెట్ చేస్తూ, డ్రోన్లతో దాడులు నిర్వహించింది.
Apple Hebbal: దక్షిణ భారతదేశంలో ఆపిల్ తన మొదటి ఆపిల్ స్టోర్‌ని ప్రారంభించింది. మంగళవారం రోజు బెంగళూర్ నగరంలో ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో ఆపిల్ కంపెనీ తన పూర్తి యాజమాన్యంలో రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. దీనిని ‘‘ఆపిల్ హెబ్బాల్’’గా పిలుస్తారు.
Glacial Lakes: హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భారతదేశంలోని హిమాలయ ప్రాంతాల్లోని 400కు పైగా హిమనదీయ సరస్సులు(గ్లేసియర్ లేక్స్) విస్తరిస్తున్నట్లు తాజా రిపోర్టులో వెల్లడించింది. ఎప్పుడైనా ప్రమాదం ముంచుకురావొచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) తన తాజా పర్యవేక్షణ నివేదికలో వెల్లడించింది. జూన్ 2025కి గ్లేసియర్ సరస్సులు, నీటి వనరుల నెలవారీ పర్యవేక్షణ నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Himanta Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆల్ ఇండియా జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మహమూద్ మదానీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన సీఎం.. అసలు మదానీ ఎవరు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో మాత్రమే ఆయనకు ప్రాముఖ్యత లభించిందని అన్నారు. ‘‘మదానీ ఎవరు..? ఆయన దేవుడా..? మదానీ ధైర్యం అంతా కాంగ్రెస్ సమయంలో మాత్రమే, బీజేపీతో కాదు. ఆయన పరిమితులు దాటితే జైలులో పెడతాను, నేను సీఎంను, మదానీ కాదు. నేను మదానీకి భయపడను’’ అని సీఎం హెచ్చరించారు.
Shehbaz Sharif: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్-రష్యా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-రష్యా సంబంధాలను తాము గౌరవిస్తున్నామని చెప్పారు. చైనాలో జరిగిన ఎస్సీఓ సమావేశానికి హాజరైన షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. మాస్కోకు న్యూఢిల్లీతో ఉన్న సంబంధాలను ఇస్లామాబాద్ గౌరవిస్తుంది, అవి చాలా బాగున్నాయని మంగళవారం షరీఫ్ అన్నారు.