20 ISIS Terrorists Escape After Earthquake: టర్కీ, సిరియా ప్రాంతాల్లో వరస భూకంకపాల వల్ల తీవ్ర ప్రభావితం అయ్యాయి. వేలాదిగా ప్రజలు మరణించారు. ముఖ్యంగా 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపాల ధాటికి టర్కీ, సిరియాలు వణికిపోయాయి. పలు బిల్డింగులు మేకమేడల్లా కూలిపోయాయి. వరసగా 100కు పైగా ప్రకంపన ధాటికి ఈ రెండు దేశాలు అతలాకుతలం అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ భూకంపం ఉగ్రవాదులకు వరంగా మారింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న పలువురు ఉగ్రవాదులు తప్పించుకునిపోయారు. సిరియాలో కరుడుగట్టిన 20 మంది ఐఎసఐఎస్ ఉగ్రవాదులు జైలు నుంచి పరారయ్యారు.
Read Also: Girl On Marriage: అతడ్ని పెళ్లి చేసుకోవచ్చా.. యువతి ప్రశ్న, నెట్టింట దుమారం
భూకంపం తరువాత సోమవారం వాయువ్య సిరియా జైలులో ఖైదీలు తిరుగుబాటు చేశారు. కనీసం 20 మంది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ టెర్రరిస్టులు జైలు నుండి తప్పించుకున్నారు. టర్కీ సరిహద్దుల్లో ఉన్న రాజో పట్టనంలోని సైనిక పోలీస్ జైలులో 2,000 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో 1300 మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నట్లు పలు వర్గాలు వెల్లడించాయి. ఈ జైలులో కుర్దిష్ దళాలకు సంబంధించిన ఖైదీలు కూడా ఉన్నారు. 7.8 మాగ్నిట్యూడ్ తో వచ్చిన భూకంపం కారణంగా జైలు గోడలు, తలుపులు బద్ధలయ్యాయి. ఇదే సమయంలో జైలులో ఖైదీలు పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. ప్రాథమికంగా 20 మంది తప్పించుకున్నారని అనుకుంటున్నప్పటికీ.. మరింత సమాచారం రావాల్సి ఉంది.
గత డిసెంబర్ లో రాజోలోని తోటి ఉగ్రవాదులను విడిపించేందుకు సిరియా రాజధాని రఖాలోని ఓ భద్రతా సముదాయంపై దాడి జరిగింది. 2011లో సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి ఖలీఫా రాజ్యం స్థాపించాలనే లక్ష్యంతో ప్రపంచంలోని ముస్లిం యువతను ఆకర్షించింది. సిరియాలో జరిగిన ఉగ్రవాద సంఘర్షణల్లో ఇప్పటికే 5 లక్షల మంది మరణించారు. సిరియాలో అంతర్యుద్ధాన్ని తట్టుకోలేక ఆ దేశ ప్రజలు యూరప్, టర్కీలకు వలసవెళ్లారు.