పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం OG (They Call Him OG). ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య నిర్మించాడు. చాలా కాలంగా హిట్ లేని పవర్ స్టార్ కు OG రూపంలో సాలిడ్ హిట్ ఇచ్చాడు సుజిత్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్ హయ్యెస్ట్ వసుళ్లు రాబట్టింది.
Also Read : Paradise : ప్యారడైజ్ సెట్స్ లో ఎంట్రీ ఇచ్చిన కయాడు లోహర్
ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సీక్వెల్‌గా OG 2 కూడా ఉంటుందని ఆ మధ్య జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. దాంతో ఈ ఈ సీక్వెల్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూసారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఏర్పడింది. అయితే తాజాగా వినిపిస్తున్న టాలీవుడ్ టాక్ ప్రకారం, OG 2 నిర్మాణం నుంచి DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ తప్పుకున్నట్లు సమాచారం. కారణాలు అధికారికంగా వెల్లడికాకపోయినా, బడ్జెట్, కమిట్‌మెంట్స్ లేదా ఇతర అంశాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఈ సీక్వెల్ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థగా పేరుగాంచిన UV ప్రొడక్షన్స్ చేపట్టబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే భారీ సినిమాలను నిర్మించిన అనుభవం ఉన్న UV ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తే, OG 2 స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే OG రిలీజ్ తర్వాత లేదా పవన్ కళ్యాణ్ కమిట్‌మెంట్స్ క్లియర్ అయిన తర్వాతే OG 2పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఈ అప్డేట్‌తో మరింత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.