Rishi Sunak May Exit Human Rights Treaty To Push Immigration Plan: యూకే ప్రధాని రిషి సునాక్ ఇమ్మిగ్రేషన్ ప్రణాళికను ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అవుతున్నారు. దేశంలో అక్రమ వలసలను అరికట్టేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం నుంచి వైదొలగనున్నారు. వలసదారుల రాకపోకలను అరికట్టేందుకు రిషి సునాక్ యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్ (ఇసిహెచ్ఆర్) నుండి వైదొలగేందుకు సిద్ధమయ్యారని సండే టైమ్స్ నివేదించింది.
Read Also: Paskistan Economic Crisis: ఐఎంఎఫ్ షరతులకు “ఎస్” అంటేనే పాక్‌కు సాయం.. ఆ షరతులు ఏంటంటే..?
ఈ ఏడాది యూకేలోకి 65,000 మంది అక్రమ వలసదారులు దేశంలోని ప్రవేశించే అవకాశం ఉందని యూకే భావిస్తోంది. ఇదే జరిగితే యూకేలోకి ఈ ఏడాది అక్రమ వలసలు 50 శాతం పెరుగుతాయి. ప్రధాని రిషి సునాక్ తో పాటు హోం సెక్రటరీ సుయెల్లా బ్రవర్ మాన్ కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టానికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లో కొత్త చట్టం రావచ్చని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. ఒకవేళ కొత్త చట్టం చట్టవిరుద్ధం అని స్ట్రాస్ బర్గ్ లోని న్యాయమూర్తులు తీర్పును ఇస్తే, సాధారణ ఎన్నికలకు ముందు ఈసీహెచ్ఆర్ నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా కూడా ఉన్నట్లు టైమ్స్ నివేదిక పేర్కొంది.
ఈసీహెచ్ఆర్ నుంచి వైదొలిగితే అధికార కన్జర్వేటీవ్, ప్రతిపక్ష లేబర్ పార్టీల మధ్య ఉద్రిక్తత పెరగనుంది. గత ఏడాది అక్టోబర్ ప్రధాన మంత్రిగా రిషి సునాక్ బాధ్యతలు తీసుకున్నారు. యూకేలో అస్తవ్యస్థంగా ఉన్న వలస విధానాన్ని పరిష్కరిస్తామని, ఫ్రాన్స్ నుంచి అక్రమ పడవ క్రాసింగ్ లను ఆపుతామని హామీ ఇచ్చారు. అక్రమ వలసలను అరికట్టేందుకు ఐదుదశల వ్యూహాన్ని కూడా ఆయన ప్రకటించారు.