PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ, విపక్షాలపై పార్లమెంట్ లో విరుచుకుపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం తప్పా మేం చేయడం లేదని, అన్ని అబద్ధపు ఆరోపణలే అని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై ఆరోపణలు, కేసు ఓడిపోతే న్యాయస్థానాలపై ఆరోపణలు, తమకు నిర్ణయం అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
PM Modi Speech In Parliament: పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు గుప్పించారు. 2008లో పార్లమెంట్ పై తీవ్రవాదుల దాడులను ఎవరూ మర్చిపోలేలని అన్నారు. 2004 నుండి 2014 కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో ఉగ్రవాదం, హింస, కుంభకోణాలే ఉన్నాయని.. ప్రతీ విషయాన్ని సంక్షోభంగా మార్చడం యూపీఏకు అలవాటు అంటూ మండిపడ్డారు.
PM Narendra Modi's speech in Parliament: పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. విపక్షాల చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. మోడీపై బురదజల్లి లబ్ధిపొందాలని విపక్షాలు అనుకుంటున్నాయి. పేపర్లు, టీవీల్లో మోడీని విమర్శించి లబ్ధిపొందలేరు.. నా జీవితాన్ని దేశం కోసం అంకితం చేశా.. దేశ ప్రజలకు నాపై విశ్వాసం ఉంది, అది విపక్షాల అంచనాకు అందదు అని అన్నారు. 140 కోట్ల మంది ప్రజల ఆశీర్వాడమే నాకు రక్ష అని.. ఈ రక్షణ కవచాన్ని మీరు ఛేదించలేరని కీలక…
PM Narendra Modi's speech in Parliament: పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్రపతి దేశంలోని మహిళలు, సోదరీమణులకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. రాష్ట్రపతి దేశంలో గిరిజనులు ఉన్నతిని పెంచారని అన్నారు. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారి, యుద్దం లాంటి పరిస్థితులను భారత్ తట్టుకుందని మోదీ అన్నారు. ఎన్నికల కంటే దేశంలోని 140 కోట్ల ప్రజల సామర్థ్యం, శక్తి గొప్పదని అన్నారు. సమర్థవంతంగా భారత్ సంక్షోభాల నుంచి బయటపడిందని, ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా…
Laptop catches fire onboard Newark-bound United Airlines flight: అమెరికాలో ఓ విమానం గాలిలో ఉండ సమయంలో హఠాత్తుగా ఓ ల్యాప్ టాప్ పేలింది. ల్యాప్ టాప్ బ్యాటరీలో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని తిరిగి ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. శాన్ డియాగో నుంచి నెవార్క్ బయలుదేరిని యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Barabanki incident: ఉత్తర్ ప్రదేశ్ లో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మొదటి విడత డబ్బులు పడగానే, భర్తలను వదిలేసి ప్రియులతో పరారయ్యారు భార్యలు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం తమ భార్యలకు రెండో విడత డబ్బులు నిలిపివేయాలని సంబంధిత అధికారులను భర్తలు వేడుకుంటున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లు లేని వారికి రూ. 3 లక్షలను అందిస్తోంది. బారాబంకీలో 40 మంది లబ్ధిదారులను…
Chinese Spy Balloons: డర్టీ డ్రాగన్ కంట్రీ చైనా అక్రమంగా ఇతర దేశాలపై గూఢచర్యం చేస్తోంది. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా స్పై బెలూన్ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని అమెరికా వాయుసేన జెట్ ఫైటర్లతో కూల్చేసింది. బెలూన్ శకలాలను సేకరిస్తోంది. బెలూన్ లో ఏ పరికరాలు ఉన్నాయి, ఏ ఉపగ్రహంతో అనుసంధానం అయి ఉంది.. ఎలాంటి సమాచారాన్ని సేకరించింది.. బెలూన్ లో ఉన్న పరికరాలకు సంబంధించి సఫ్లై చైన్స్ వివరాలను కూడా అమెరికా సేకరించే పనిలో ఉంది. 11 కిలోమీటర్ల…
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. పార్లమెంటులో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం త్రివర్ణ పతాకంలో ఆకుపచ్చ రంగును తొలగిస్తుందా..? అని ప్రశ్నించారు. పచ్చదనంలో ప్రభుత్వానికి ఎందుకు ఇన్ని ఇబ్బందులు అని అడిగారు. చైనా చొరబాటుపై ప్రధాని మోదీ మాట్లాడరా..? బిల్కిస్ బానోకు న్యాయం చేస్తారా.? అని ప్రశ్నించారు.
Hyundai Ioniq 5: లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో హ్యుందాయ్ నుంచి ఐయోనిక్ 5 వస్తోంది. ఈ కారుకు ఇండియాలో యమ క్రేజ్ ఏర్పడింది. తొలి ఏడాదిలో 250-300 కార్లను డెలివరీ చేయాలని హ్యుందాయ్ భావించింది. అయితే దీనికి రెండింతల బుకింగ్స్ అయ్యాయి. ఇప్పటి వరకు 650కి పైగా ఐయోనిక్ 5 బుకింగ్స్ జరిగాయి. డిసెంబర్ 2022లో ఐయోనిక్ 5 ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. ఇప్పటి వరకు 650 కార్లు బుక్ అయ్యాయి. వీటిని వచ్చే నెల మార్చి నుంచి కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు సంస్థ…
Turkey Earthquake: టర్కీలో వరసగా వచ్చిన భూకంపాలు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాల వల్ల టర్కీ, సిరియా దేశాల్లో ఇప్పటి వరకు 5000కు పైగా మరణించారు. శిథిలాలు వెలికితీస్తుంటే మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. వరసగా రెండు రోజలు వ్యవధిలో 100కు పైగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇంతపెద్ద భారీ భూకంప టర్కీలో సంభవించడానికి అసలు కారణం ఏమిటి.. టర్కీ తరుచుగా భూకంపాలకు ఎందుకు గురువుతుంది..? అనేది జనాల్లో వస్తున్న సందేహం.