Kerala: కేరళలో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ మాట్లాడుతూ.. పినరయి విజయన్ ప్రభుత్వం కన్నా ఆవులే మేలు అంటూ వ్యాఖ్యలు చేశారు. కేరళలో మంత్రుల కన్నా ఆవులే ప్రజలకు ఎక్కువ సహకారాన్ని అందిస్తున్నాయని అన్నారు. కేరళ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆవుల వల్ల ప్రజలకు ఆదాయం సమకూరుతుందని అన్నారు.
Air India Finalises Deal With Airbus: టాటాల చేతికి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ తో కీలక ఒప్పందం చేసుకున్నట్లు నివేదిక చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఎయిర్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు.. వచ్చే వారం ఈ ఒప్పందంపై కీలక ప్రకటన చేస్తుందని
Increase in vitamin D supplements could reduce risk of type 2 diabetes: ఇండియాలో డయాబెటిక్ వ్యాధి ఏటేటా పెరుగుతోంది. జీవనశైలిలో మార్పు రావడం, శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లు ఇలా షుగర్ వ్యాధికి అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే విటమిన్-డి, టైప్ -2 డయాబెటిస్ మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. టప్ట్స్ మెడికల్ సెంటర్ పరిశోధకులు విటమిన్-డి తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
Asaduddin owaisi: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో ఎంఐఎం పొత్తు గురించి ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో చెప్పేందుకు ఇంకా టైం ఉందని అన్నారు. ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని అన్నారు.
Indian Citizenship: వృత్తి, ఉద్యోగరీత్యా ఇతర దేశాల్లో స్థిరపడిన భారతీయులు, భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2011 నుంచి 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2022లో 2,25,620 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రకటించింది. పార్లమెంట్ లో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులపై అడిగిన ఓ ప్రశ్నకు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.
MLC Election: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో తెలంగాణలో హడావుడి ప్రారంభం అయింది. తెలంగాణలో ఒక టీచర్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాబోతున్నాయి. ముఖ్యం హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై మజ్లిస్ పార్టీ నజర్ పెట్టింది.
Tummala Nageswara Rao: విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కావద్దని, చిత్తశుద్ధితో పనిచేస్తే ఉన్నతస్థాయికి ఎదుగుతారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. నేలకొండపల్లిలో రాజకీయంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రతినిధిగా రెండు, మూడు సంవత్సరాల్లోనే అభివృద్ధి చేశానని అన్నారు. రామదాసు జీవిత చరిత్ర కోసం నాలుగు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. నేలకొండపల్లిలో డిగ్రీ, ఇంటర్ భవనాలకు ఏర్పాటు చేశామని, ప్రజల కోరిక మేరకు జాతీయ రహదారిని ఊరు బయటనుంచి రూట్ మార్చానని అన్నారు
Acid attack on minority girl in Pakistan: పాకిస్తాన్ లో మైనారిటీలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ హిందూ, క్రిష్టియన్ యువతులను బలవంతంగా అపహరించి, మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిలనే కాదు, పెళ్లై బిడ్డలు ఉన్న మహిళలను కూడా అపహరించి బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారు.
Turkey insults Pakistan: అసలే ఆర్థిక ఇబ్బందుల్లో, కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న పాకిస్తాన్ ను ఏ దేశం కూడా పట్టించుకోవడం లేదు. పతనానికి కొన్ని అడుగుల దూరంలో ఉంది పాకిస్తాన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) షరతులకు తలొగ్గితేనే పాకిస్తాన్ కు అప్పు పుడుతుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ నాయకులు మాత్రం కొన్ని సందర్భాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నారు.
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రేవంత్ రెడ్డి ఇటీవల ప్రగతి భవన్ ను నక్సల్స్ పేల్చేయాలని కామెంట్స్ చేశారు. కాగా, రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని.. ప్రగతి భవన్ కేసీఆర్ సొత్తు కాదని..