PM Narendra Modi: ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది.. కొందరు దేశ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi’s speech in Parliament: పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్రపతి దేశంలోని మహిళలు, సోదరీమణులకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. రాష్ట్రపతి దేశంలో గిరిజనులు ఉన్నతిని పెంచారని అన్నారు. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారి, యుద్దం లాంటి పరిస్థితులను భారత్ తట్టుకుందని మోదీ అన్నారు. ఎన్నికల కంటే దేశంలోని 140 కోట్ల ప్రజల సామర్థ్యం, శక్తి గొప్పదని అన్నారు. సమర్థవంతంగా భారత్ సంక్షోభాల నుంచి బయటపడిందని, ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని అన్నారు.
ప్రపంచం అంతా భారత్ వైపు ఎంతో ఆశగా ఎదురుచూస్తోందని అన్నారు. భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని, రాజకీయ అస్థిరత లేదని, పైగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉందని చెప్పారు. విమర్శలను పట్టించుకోం అని.. సమయానుకూలంగా దేశానికి ఏం కావాలో అది చేసుకుంటూ పోతాం అని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలో అవినీతిని నిర్మూలించాం. భారత్ ఈ క్షణం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూసిందని.. కోవిడ్‌ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది.. చాలా దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయి.. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్ ఆవిర్భవించింది.. ఇది దేశం గర్వించదగిన విషయం అని అన్నారు.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
Read Also: USA: విమానంలో ల్యాప్‌టాప్‌కు మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్..
దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించామని.. 150 దేశాలకు వ్యాక్సిన్లు పంపిణీ చేశామని ప్రధాని సభలో ప్రకటించారు. డిజిటల్ ఇండియాను చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయని.. వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ కూడా క్షణాల్లో వచ్చేస్తున్నాయని.. కానీ కొందరు మాత్రం నిరాశతో ఉన్నారని విమర్శించారు. దేశంలో 90 వేల స్టార్టప్స్ పనిచేస్తున్నాయి, మొబైళ్ల తయారీలో దేశం రెంస్థానంలో ఉంది, ఇంధనం వినియోగంలో భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపారు.
ప్రపంచ అభివృద్ధితో పాటు భారతదేశం తన అభివృద్ధిని కూడా చూసుకుంటోందని, ఇది చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. దేశీయ వైమానిక రవాణాలో భారత్ మూడో స్థానంలో ఉందని, అన్ని క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చూపిస్తున్నారని కొనియాడారు. భారత్ లోని ప్రతి రంగంలోనూ, ప్రతి ఆలోచనలోనూ, పెద్ద ఎత్తున ఆశాభావం కనిపిస్తోందని, మెడికల్, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సుల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. ఇదంతా చూసి కొంతమంది నిరాశలో కూరుకుపోయారని విమర్శించారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..