PM Narendra Modi’s speech in Parliament: పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. విపక్షాల చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. మోడీపై బురదజల్లి లబ్ధిపొందాలని విపక్షాలు అనుకుంటున్నాయి. పేపర్లు, టీవీల్లో మోడీని విమర్శించి లబ్ధిపొందలేరు.. నా జీవితాన్ని దేశం కోసం అంకితం చేశా.. దేశ ప్రజలకు నాపై విశ్వాసం ఉంది, అది విపక్షాల అంచనాకు అందదు అని అన్నారు. 140 కోట్ల మంది ప్రజల ఆశీర్వాడమే నాకు రక్ష అని.. ఈ రక్షణ కవచాన్ని మీరు ఛేదించలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్లుగా నేను ప్రజా జీవితంలో ఉన్నా, పేదల కష్టసుఖాల గురించి తెలుసని అన్నారు.
Read Also: PM Narendra Modi: ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది.. కొందరు దేశ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
నేను 25 కోట్ల కుటుంబాల సభ్యుడిని అని.. కొందరు ఒకే కుటుంబానికి సేవ చేస్తారు, కానీ నేను 25 కోట్ల కుటుంబాలకు సేవ చేస్తున్నా అని ప్రధాని అన్నారు. దేశంలో రోడ్లు, హైవేలు, రైల్వేలు గణనీయంగా అభివృద్ధి చేశామని వెల్లడించారు. ఒకప్పుడు రైల్వేలు అంటే యాక్సిడెంట్లు గుర్తుకు వచ్చేవని, ఇవాళ వందే భారత్ రైలును చూసి భారతీయులు గుర్వపడుతున్నారని అన్నారు. దేశాన్ని ముందుకు నడిపిస్తోంది మధ్యతరగతి వర్గమే అని, ఒకప్పుడు ప్రభుత్వాలు మధ్య తరగతిని గుర్తించలేదని.. మా ప్రభుత్వం మధ్యతరగతి వర్గం నిజాయితీని గుర్తించిందని ప్రధాని వెల్లడించారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల దేశ అభివృద్ధి జరగదని అన్నారు .అనేక పథకాల్లో మధ్యతరగతి వర్గానికి ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. జన ఔషధి స్టోర్ వల్ల మధ్యతరగతి వర్గానికి చాలా మేలు జరుగుతుందని తెలిపారు.
9 ఏళ్లలో 70 ఎయిర్ పోర్టుల కట్టామని అన్నారు. మనదేశంలోనే మొబైల్ డేటా ఛార్జీలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. 2020 నుంచి 2030 దశాబ్ద కాలం “ఇండియా డికేడ్” గా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని స్పష్టం చేశారు.నాలుగు వరసల రోడ్లను దేశమంతటా విస్తరిస్తున్నాం అని.. మౌళికసదుపాయాల ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రధాని వెల్లడించారు. దేశ ప్రజలు నెగిటివిటీని నమ్మడం లేదని, విపక్షాలు పునారాలోచించుకోవాల్సిన సమయం అని ప్రధాని హితవు పలికారు.