PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ, విపక్షాలపై పార్లమెంట్ లో విరుచుకుపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం తప్పా మేం చేయడం లేదని, అన్ని అబద్ధపు ఆరోపణలే అని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై ఆరోపణలు, కేసు ఓడిపోతే న్యాయస్థానాలపై ఆరోపణలు, తమకు నిర్ణయం అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై విచారణ జరుగుతుంటే దర్యాప్తు సంస్థలపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. చివరకు ప్రతిపక్షాలు సైన్యంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారని ఫైర్ అయ్యారు.
Read Also: Revanth Reddy : తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు
సాధారణంగా ఎన్నికలు, వాటి ఫలితాల సమయంలో ప్రతిపక్షాలు ఏకం అవుతాయని.. ప్రజలు చేయలేనిది ఈడీ చేసిందని ప్రధాని అన్నారు. అవినీతి ప్రతిపక్షాలను కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా కిందకి తెచ్చామని అన్నారు. ఈడీ అన్ని ప్రతిపక్షాలను ఒకే వేదికపైకి తెచ్చిందని చెప్పారు.
రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ పర్యటన గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇటీవల జమ్మూకాశ్మీర్ వెళ్లి వచ్చినవారు అక్కడి ఎలా వెళ్లాలో చూసి ఉండాలి అని.. గతంలో లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగిరేయాలని నేను కాశ్మీర్ వెళ్లానని, ఉగ్రవాదుల బెదిరింపులు కూడా లెక్క చేయకుండా, బుల్లెట్ ఫ్రూవ్ వాహనాలు లేకుండా లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగిరేశానని అన్నారు. గతంలో కాశ్మీరో లో భయానక పరిస్థితులు ఉండేవని.. కానీ ప్రస్తుతం ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురుతోందని ప్రధాని మోదీ అన్నారు.