Zomato: 225 సిటీల్లో నిలిచిపోనున్న జొమాటో సేవలు..కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zomato: పుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్ జొమాటో తన మూడో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. కంపెనీ ఆదాయం 75 శాతం పెరిగింది. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో రూ. 1,112 కోట్లు కాగా.. ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో రూ.1,948 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే నష్టాలు మాత్రం 450 శాతం పెరిగాయి. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో రూ. 63 కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ.345 కోట్ల నష్టాలు చవిచూసింది. మునుపటి క్వాటర్లీ ఫలితాలతో పోల్చుకుంటే వినియోగదారుల లావాదేవీలు పడిపోయాయి. ఆర్థిక సంవత్సరం 2023 రెండో త్రైమాసికంలో జొమాటో మొత్తం 17.5 మిలియన్ల లావాదేవీలను కలిగి ఉంది. ఇది మూడో త్రైమాసికంలోకి రాగానే 17.4 మిలియన్లకు పడిపోయింది. అక్టోబర్ నుంచి ఫుడ్ డెలివరీ వ్యాపారంతో మందగమనాన్ని చూస్తున్నట్లు జొమాటో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కనిపిస్తోందని.. అయితే టాప్-8 నగరాల్లో అంతకన్నా ఎక్కువగా ఉందని తెలిపింది.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ఇదిలా ఉంటే వ్యాపారంతో తగ్గుదల కారణంగా ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది జొమాటో. 225 నగరాల్లో తన సేవలను నిలివేసింది. చిన్న నగరాల నుంచి తమ సర్వీసుల నుంచి నిష్క్రమించినట్లు తెలిపింది. ఈ నగరాలపై తాము పెట్టిన పెట్టుబడి అనుకున్న సమయంలో వచ్చేలా లేదని.. గత కొన్ని త్రైమాసికాలుగా ఈ నగరాల్లో వ్యాపారం సరిగా జరగడం లేదని జొమాటో తెలిపింది. జొమాటో తన ఆదాయాలను వేగంగా పెంచుకోగలుగుతున్నప్పటికీ.. బ్లింకిట్ కొనుగోలు చేసిన తర్వాత, దాని నష్టాలు, ఆదాయ వృద్ధిని మించిపోయాయి. ఫుడ్ డెలివరీ వాల్యూమ్ సాపేక్షంగా ఏడాదికి 25 శాతం పెరగాలి. కానీ అలా జరగకపోవడంతో 225 నగరాల నుంచి జొమాటో నిష్క్రమిస్తోంది.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!