Turkey Earthquake: టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరణాల సంఖ్య గంటగంటకు పెరుగుతూనే ఉంది. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి టర్కీ దక్షిణ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. శిథిలాలు వెలికితీస్తున్నా కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు టర్కీ, సిరియాలో కలిపి 28,000 పైగా మరణాలు నమోదు అయ్యాయి. టర్కీలో 24,617 మంది, సిరియాలో 3,574 మంది మరణించారని అధికారులు మరియు వైద్యులు తెలిపారు. మొత్తంగా 28,191 మంది మరణించారు.
Read Also: Hyderabad Fake Baba Arrest: దొంగ బాబా అరెస్ట్.. 8వ పెళ్లి చివరి క్షణంలో బాగోతం బట్టబయలు
ఇదిలా ఉంటే చనిపోయిన వారి సంఖ్య ఇంతకు రెట్టింపు లేదా అంతకన్నా ఎక్కువగా ఉండవచ్చని యూఎన్ రిలీఫ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ అన్నారు. శనివారం ఆయన టర్కీలోని దక్షిణ నగరమైన కహ్రామన్‌మారాస్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం చనిపోయిన వారి సంఖ్యను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని.. అయితే మరణాలు ఇప్పుడున్న సంఖ్యకు రెట్టింపు లేదా అంతకుమించి ఉండవచ్చని అన్నారు. ప్రస్తుతం టర్కీ సంస్థలకు చెందిన 32,000 మందికి పైగా ప్రజలు సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రయత్నాల్లో పనిచేస్తున్నారని ఆ దేశం వెల్లడించింది. ఈ భూకంపం వల్ల 2.6 కోట్ల మంది ప్రభావితం అవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) అంచనా వేసింది.