India-US Relations: భారతదేశంపై ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ట్రంప్ 50 శాతం సుంకాలను విధించారు. దీనిపై అమెరికాలోనే వ్యతిరేకత వస్తోంది. భారత్ వంటి మిత్రదేశాన్ని దూరం చేసుకుంటోందని ట్రంప్ పరిపాలను అమెరికా నిపుణులు తిట్టిపోస్తున్నారు. అయితే, ఇప్పుడు భారత్‌కు మరో అనూహ్య మద్దతు లభించింది. భారతదేశంపై అమెరికా అధికారులు విమర్శలు పెంచుతున్న నేపథ్యంలో, వీటిని ఆ దేశంలోని యూదుల కమిటీ ఖండించింది. ప్రజాస్వామ్య దేశం, వ్యూహాత్మక భాగస్వామిగా అయిన భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించాలని కోరింది.
Read Also: పులివెందులలో సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ జగన్
రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ ‘‘బాధ్యత వహించదు’’ అని అమెరికా యూదుల న్యాయవాద బృందం చెప్పింది. రష్యన్ ఆయిల్‌ని భారత్ కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని ట్రంప్ పరిపాలన ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పరస్పర సుంకాల్లో భాగంగా 25 శాతం, రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్నందున మరో 25 శాతం సుంకాలను విధించింది. మరోవైపు, ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌పై చేస్తున్న విమర్శలను దుర్మార్గపు ఆరోపణలుగా పేర్కొంది.