Donald Trump: భారత్‌తో సంబంధాలు ‘‘ఏకపక్ష విపత్తు’’.. భారత్‌పై ట్రంప్ అక్కసు..
- భారత్‌పై మరోసారి ట్రంప్ అక్కసు..
- భారత్‌తో సంబంధాలు ‘‘ఏకపక్ష విపత్తు’’..
- సుంకాలను సమర్థించుకున్న ట్రంప్..
- పుతిన్‌తో భేటీ అనంతరం ట్రంప్ నుంచి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం జరిపిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. మరోసారి, ట్రంప్ తన అక్కసును భారత్‌పై వెళ్లగక్కుతూ, తాను విధించిన 50 శాతం సుంకాలను మరింతగా సమర్థించుకున్నాడు. భారత్-అమెరికా సంబంధాలను ‘‘ఏకపక్ష విపత్తు’’గా అభివర్ణిస్తూ తన కోపాన్ని రెట్టింపు చేశాడు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం, సైనిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్లే సుంకాలు విధించాల్సి వచ్చిందని తన సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు.
Read Also: Donald Trump: ‘‘భారత్ చాలా ఆలస్యం చేసింది’’.. సుంకాలపై ట్రంప్ బిగ్ కామెంట్స్..
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
అయితే, ఇదే కాకుండా మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. భారత్ తన సుంకాలను తగ్గించుకోవడానికి ముందుకు వచ్చిందని, కానీ అప్పటికే ఆలస్యమైందంటూ పేర్కొన్నారు. ఇండియా దీనికి కొన్ని ఏళ్ల క్రితమే చేయాల్సిందని అన్నారు. ‘‘వారు (భారత్) మాతో అపారమైన వ్యాపారం చేస్తారు. భారీ మొత్తంలో మాకు వస్తువులు అమ్ముతారు. కానీ మేము వారికి తక్కువగా అమ్ముతాము. ఇప్పటి వరకు, ఇది పూర్తిగా ఏకపక్ష సంబంధం’’ అని ట్రంప్ ఆరోపించారు.
ట్రంప్ సుంకాలకు, బెదిరింపులకు ఇండియా భయపడకపోవడంతో ట్రంప్ పరిపాలన తీవ్రమైన అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే భారత్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చైనాతో భారత బంధాలు బలపడేందుకు ట్రంప్ పరోక్షంగా సాయం చేస్తున్నాడు. ట్రంప్ టారిఫ్స్ కారణంగా రెండు దేశాలు మరింత సహకరించుకోవాలని ఎస్‌సీఓ సమావేశంలో ఇరు దేశాధినేతలు అవగాహనకు వచ్చారు. ఇక, రష్యా అధినేత పుతిన్‌తో మోడీ చర్చలు అంతర్జాతీయంగా హెడ్‌లైన్స్‌గా మారాయి. రష్యా నుంచి చమురు కొంటామని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!