Bird Flu: జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ అలర్ట్.. కడక్‌నాథ్ కోళ్లలో గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bird Flu Alert In Jharkhand: జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ కోళ్ల ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. బొకారో జిల్లాలోని ఫౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రతమత్తం అయింది. లోహాంచల్ లోని ప్రసిద్ధ ‘‘కడక్ నాథ్’’ కోళ్ల మాంసంలో హెచ్5ఎన్1 వేరియంట్ ఉన్నట్లు నిర్థారించారు. అధిక ప్రొటీన్లు ఉండే కడక్ నాథ్ కొళ్లలో ఈ వేరియంట్ ను కనుక్కున్నారు. లోహంచల్‌లోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ కారణంగా కడక్‌నాథ్ కోళ్లు చనిపోయాయి. ఒక కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాలను ప్రభావిత జోన్ గా ప్రకటించారు. 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో నిఘాను పెంచారు.
Read Also: Wednesday Stotram: విద్య, వివాహం, అభివృద్దికి ఈ స్తోత్ర పారాయణం చేయండి
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ప్రభావిత ప్రాంతాల్లో కొళ్లు, బాతుల అమ్మకాలతో పాటు మాంసం అమ్మకాలను నిషేధించారు. బర్డ్ ఫ్లూ విషయంలో రాష్ట్రం అప్రమత్తంగా ఉందని ఆరోగ్య శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి అరుణ్ కుమార్ వెల్లడించారు. బొకారో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఉంచారు అధికారులు. పెద్ద పౌల్ట్రీ ఫారమ్ కోళ్లు, బాతుల నమూనాలను పరిశీలించడానికి ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు వ్యాధి సోకిన జోన్‌లో నివసిస్తున్న వ్యక్తుల నమూనాలను సేకరించాలని వైద్య బృందాన్ని ఆదేశించారు అధికారులు. ఎవరికైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉంటే చికిత్స కోసం ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల పాటు చికెన్, బాతు మాంసాన్ని తినడం మానేయాలని ప్రజలకు సూచించారు అధికారులు. మనుషుల్లో ఈ వ్యాధి వస్తే.. తీవ్రమైన వెన్నునొప్పి, జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం, జలుబు, కఫంలో రక్తం వంటి లక్షణాలు ఉంటాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!