Roopa vs Rohini: కర్ణాటకలో కర్ణాటక దేవాదాయ కమిషనర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి, కర్ణాటక హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ రూపా డి. మౌద్గిల్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇద్దరు తమ పదవులను మరిచి సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా విమర్శలకు దిగడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరికి పోస్టింగులు ఇవ్వలేదు.
ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ మధ్య వార్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. ఐపీఎస్ రూప ఫేస్ బుక్ లో ఐఏఎస్ రోహిణి సింధూరిపై ఆరోపణలు చేశారు. రోహిణి సివిల్ సర్వెంట్ అధికారుల నియమావళిని ఉల్లంఘించారని, రోహిణి అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై స్పందించిన రోహిణి.. రూప మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Read Also: Tomato Shortage: యూకేలో తీవ్రంగా టొమాటోల కొరత.. ఖాళీగా సూపర్ మార్కెట్లు..
ఈ ఘటనపై ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై విచారణకు ఆదేశించారు. ఈ ఇద్దరి వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ వందితా శర్మకు, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశాల జారీ చేశారు. మరోవైపు కర్ణాటక హోం మంత్రి అరాగ జ్ఞానేంద్ర స్పందిస్తూ.. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చొదని అన్నారు. సీఎం ఇప్పటికే సీఎస్, డీజీపీలో చర్చించారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ లను ప్రజలు దైవసమానులగా చూస్తారని.. కానీ వారిద్దరు తమ హోదాలను అవమానిస్తున్నారని, వారి వ్యక్తిగత వైరమే ఇందులో కనిపిస్తోందని, వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలని, వీధి గొడవగా మార్చొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.