Alzheimers: చైనాలో 19 ఏళ్ల వ్యక్తికి మెదడుకు సంబంధించిన అరుదైన వ్యాధి ‘అల్జీమర్స్’ సోకినట్లు నిర్దారణ అయింది. జ్ఞాపకశక్తిపై ఈ వ్యాధి తీవ్రప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణంగా వయసు పైబడిన వారికి మాత్రమే అరుదుగా ఈ వ్యాధి వస్తుంది. అయితే 19 ఏళ్ల వ్యక్తికి రావడం ప్రపంచంలో ఇదే తొలిసారని బీజింగ్ లోని క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీ, జువాన్ వు హాస్పిటల్ పరిశోధకులు వెల్లడించారు. యువకుడి జ్ఞాపకశక్తి రెండేళ్ల కాలంలో వేగంగా క్షీణించిందని పరిశోధకులు వెల్లడించారు.
Read Also: Off The Record: సీడబ్ల్యూసీలో చోటు దక్కే ఆ ఒక్క కాంగ్రెస్ నేత ఎవరు?
ఇటీవల అతడు జరిగిన సంఘటనలను, వస్తువులను ఎక్కడ పెట్టాడో కూడా గుర్తుంచుకోలేని దశకు చేరుకున్నాడని, అతను ఇటీవలి సంఘటనలను, వస్తువుల స్థానాలను గుర్తుకు తెచ్చుకోలేని దశకు చేరుకున్నాడని తెలిపారు. రోగి జ్ఞాపకశక్తి కోల్పోవడం, హిప్పోకాంపల్ క్షీణత వంటి అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను కలిగి ఉన్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఆ యువకుడు అతని హైస్కూల్ విద్యను ఆపేయాల్సి వచ్చిందని, చదవడం, రాయడం వంటి వాటికి అతను ప్రతిస్పందించడం నెమ్మదించిందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా 30 ఏళ్ల లోపు అల్జీమర్స్ వచ్చే వారిలో జన్యుపరమైన కారణాలు ఉంటాయని.. చివరి సారిగా 21 ఏళ్ల వయస్సు గలిగిన వ్యక్తిలో ఈ వ్యాధిని కనుక్కున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అంతకన్నా తక్కువ వయసు ఉన్న 19 ఏళ్ల యువకుడిలో ఈ వ్యాధిని గుర్తించారు.