Khalistan sympathiser Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని సవాల్ చేస్తూ హెచ్చరించారు. ఇటీవల అజ్నాలా పోలీస్ స్టేషన్ పై సాయుధులుగా వచ్చి దాడి చేశారు అమృత్ పాల్ సింగ్ మద్దతుదారులు. అతని అనుచరుడిని అరెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ఖలిస్తానీ మద్దతుదారులు వచ్చి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ ఘటన మరోసారి పంజాబ్ లో ఖలిస్తానీ వేర్పాటువాదం బలపడుతోందని చెబుతోంది. ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ తనను తాను బ్రిందన్ వాలా 2.0గా భావించుకుంటున్నారు.
‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ గా ఉన్న అమృత్ పాల్ తాజాగా భారత్ పై విషాన్ని చిమ్మాడు. ప్రభుత్వాన్నే సవాల్ చేస్తూ హెచ్చరించాడు. అజ్నాలా దాడి హింసాత్మకం కాదని.. అసలు హింస ఇంకా చూడలేదని వార్నింగ్ ఇచ్చారు. మీరు నినాదాలు చేయడాన్ని, జెండాలను ప్రదర్శిండాన్ని హింసగా పరిగణిస్తున్నారని.. ఇది నిజమైన హింస కాదని ఆయన అన్నారు. అణచివేయబడిన ప్రజలు హింసను ఎంచుకుంటారని.. ప్రజలు హింసను చెడ్డది అని అనుకుంటారు కానీ హింస పవిత్రమైనదని కామెంట్స్ చేశారు. మీకు వేరే మార్గం లేనప్పుడు కత్తి పట్టుకోవడం సరైనదని గురుగోవింద్ సింగ్ జీ చెప్పాని అమృత్ పాల్ సింగ్ అన్నారు. ఖలిస్తాన్ సానుభూతిపరుడు పంజాబ్ సంస్కృతిని అణచివేయడం మరియు వనరుల దోపిడీ యొక్క అంతిమ ఫలితం హింస మాత్రమే అని అన్నారు.
Read Also: NIA: కాన్పూర్ కుట్ర కేసులో 8 మంది ఐఎస్ ఉగ్రవాదులను దోషులుగా తేల్చిన కోర్టు..
మనం భారతీయులమని ఎందుకు చెప్పుకోవాలి, భారతదేశం యొక్క సంస్కృతి ఏమిటి? భారతదేశం యొక్క దుస్తులు ఏమిటి మరియు భారతీయ ఆహారం ఏమిటి? అని ప్రశ్నించాడు. భారతీయులం అనే కథనం నకిలీదని, జాతీయవాదం తాడు చాలా సన్నగా ఉందని ఏ రోజైనా తెగిపోవచ్చని అన్నారు. బలూచిస్తాన్ లో భారత్ చేస్తుందే, జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ చేస్తుందని కామెంట్స్ చేశారు. అజ్నాలా ఘటనపై డీజీపీ గౌరవ్ యాదవ్ చేసి ప్రకటనపై అమృత్ పాల్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా చర్యలు తీసుకునే ముందు ప్రభుత్వం అజ్నాలా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ప్రజల బలాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.
ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచివేయడానికి ఏ చర్య తీసుకున్నా ఫలితం ఉండదని అమృతపాల్ మరోసారి పేర్కొన్నారు. కేంద్ర, పంజాబ్ ప్రభుత్వం మమల్ని ఆపలేవని, అలెగ్జాండర్ ఆపలేరు, మొఘలులు, బ్రిటీష్‌లు దీన్ని అణిచివేయలేకపోయారు, హిందూస్థాన్ కూడా దానిని అణచివేయలేదని ప్రగల్భాలు పలికారు. పంజాబ్ ఏదో రోజు స్వతంత్రం అవుతుందని, ఖలిస్తానీ భావజాలం ఎప్పటికీ చావదని అన్నారు.