New Record: టికెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.100 కోట్లు వసూలు.. రైల్వే హిస్టరీలోనే రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Record in Railway Fines: సెంట్రల్ రైల్వేస్ ముంబై డివిజన్ అరుదైన రికార్డును సాధించింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి రూ. 100 కోట్లను జరిమానాల రూపంలో వసూలు చేసింది. దీంతో భారతీయ రైల్వేల్లో అద్భుతమైన రికార్డ్ సృష్టించిన తొలి డివిజన్ గా ముంబై నిలిచింది. ఏప్రిల్ 2022 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 18 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేేసింది. గతేడాది ఇది రూ. 60 కోట్లుగా ఉంది. టికెట్ లేకుండా ప్రయాణాలు చేయవద్దని సెంట్రల్ రైల్వే ప్రయాణికులను హెచ్చరిస్తోంది. అయితే ఇవన్నీ పట్టకుండా టికెట్ లేకుండా ప్రయాణిస్తుండటంతో పెద్ద ఎత్తున ఫైన్ లను వసూలు చేస్తున్నారు అధికారులు.
Read Also: Hong Kong Model: మోడల్‌ను హత్య చేసి.. ముక్కలు చేసి సూప్ వండిన మాజీ భర్త
Also Read
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
- Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
టికెట్ చెకింగ్ చేయడం ద్వారా ప్రయాణికులకు మరింతగా సౌకర్యవంతంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నామని, రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులు, టికెట్ తీసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు కలుగచేస్తున్నారనే ఫిర్యాదుతో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని దీంతో ఈ రికార్డు సాధ్యం అయిందని సెంట్రల్ రైల్వేస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ సుతార్ వెల్లడించారు. మొత్తం ఫైన్లను సబర్భన్ లలో టికెట్ లేని ప్రయాణికలు నుంచి, ఇతర సాధారణ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వాళ్ల నుంచి వసూలు చేశారు.
ముంబై డివిజన్ లో 77 రైల్వే స్టేషన్లలో, 1200 మంది టికెట్ ఎగ్జామినర్ల( టీటీఈ)లు ఉన్నారు. వీరంతా టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికులపై నిఘా పెడుతున్నారు. టికెట్ లేకుండా ప్రయాణించే వారి బాడీ లాంగ్వేజ్ ద్వారానే వారిని గుర్తిస్తున్నామని, నిరంతం నిఘా వల్ల వారు ఎలా వ్యవహరిస్తారో తెలుసుకుని, గుర్తిస్తున్నామని టీటీఈలు చెబుతున్నారు. ఎయిర్ కండిషన్డ్ లోకల్ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 25,781 మంది ప్రయాణికుల నుంచి రూ. 87.43 లక్షల జరిమానా, ఫస్ట్ క్లాస్ కోచ్‌లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించిన 1.45 లక్షల మంది ప్రయాణికుల నుంచి రూ. 5.05 కోట్ల జరిమానాతో కలిపి మొత్తంగా రూ. 100 కోట్ల జరిమానా విధించినట్లు సెంట్రల్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 2019-20 లో ముంబై డివిజన్ 15.73 లక్షల మంది నుంచి రూ. 76.82 కోట్లను వసూలు చేసింది.
తాజావార్తలు
-
I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
-
Botsa Satyanarayana: లోకేష్ రాజీనామా చేయాలి.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!