Heatwave Advisory: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో గరిష్ట సగటు ఉష్ణోగ్రతలు పెరిగాయి. మార్చి నుంచి మే వరకు పలు దేశంలోని చాలా ప్రాంతాల్లో వడగాలుల వీస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం హీట్‌వేవ్ అడ్వైజరీని జారీ చేసింది. ఈ ఏడాది ఊహించిన దాని కన్నా వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషన్ మార్గదర్శకాలను జారీ చేశారు.
టీ, కాఫీ, హై ప్రొటీన్ ఆహారాలకు దూరంగా ఉండాలని సూచించారు. వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇవ్వడంతో పాటు, ప్రజలు అవసరమైన మందులు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్‌లు, ఐస్ ప్యాక్‌లు, ఓఆర్ఎస్ సిద్దంగా ఉంచాలని మంత్రిత్వశాఖ సూచించింది. ప్రజలు రోజంతా హైడ్రేటెడ్ గా ఉండాలని, ఓఆర్ఎస్ తీసుకోవాలని తెలిపింది . అధికంగా నీరు ఉండే సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలను తీసుకోవాలని, ప్రజలు నిమ్మరసం, లస్సీ, పండ్ల రసాలను వంటి పానీయాలను కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలని పేర్కొంది.
Read Also: Ravindra Jadeja: మరో మైలురాయిని సాధించిన జడేజా.. రెండో భారతీయ ఆటగాడిగా..
వీటికి దూరంగా ఉండండి:
ముఖ్యంగా టీ, కాఫీ, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలను తీసుకోవద్దని, ఇవి శరీరం మరింతగా నీటిని కోల్పేయేందుకు దోహదపడుతాయని, కడుపులో ఇబ్బందికి కారణం కావచ్చు అని వైద్యులు, ఆహార నిపుణులు తెలుపుతున్నారు. నిలువచేసిన ఆహారాన్ని, అధికంగా ప్రోటీన్స్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. అధిక వేడి ఉన్న సమయంలో మాంసాహారం తీసుకోవడం తగ్గించాలని, ఇది డీహైడ్రెషన్ కు కారణం కావడంతో పాటు జీర్ణించుకోవడానికి సమస్యలు ఏర్పడుతాయని సూచిస్తున్నారు. టీ, కాఫీల బదులుగా నిమ్మరసం, కొబ్బరి నీరు, మజ్జిగ తీసుకోవాలని, కారంగా ఉండే ఆహారాన్ని తగ్గించుకోవాలని తెలిపారు.