Twitter Down: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మరోసారి పనిచేయలేదు. కొన్ని గంటల పాటు నెటిజెన్లు తమ ట్వీట్లను, లాగిన్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత పలుమార్లు ఇలాగే ట్విట్టర్ డౌన్ అయింది. తాజాగా బుధవారం ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ అంతరాయాన్ని ఎదుర్కొంది. చాలాా మంది యూజర్లు ట్వీట్లను చూడలేపోయారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ సాంకేతిక బృందం పనిచేస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘ డౌన్ డిటెక్టర్’ కూడా వందల కొద్దీ ఫిర్యాదులను చూపుతోంది. మొబైల్, డెస్క్ టాప్ రెండింటిలో కూడా ట్విట్టర్ డౌన్ అయింది. దీనిపై నెటిజెన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మస్క్ ట్విట్టర్ సొంతం చేసుకున్న తర్వాత ఇలా అంతరాయ కలగడం ఇది నాలుగోసారి.
Read Also: Threat Call: ముఖేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్ బంగ్లాలను పేల్చేస్తాం.. పోలీసులకు బెదిరింపు కాల్
దాదాపుగా 200 మందిని లేదా 10 శాతం మందిని ఎలాన్ మస్క్ ట్విట్టర్ నుంచి తొలగించిన తర్వాత ఈ సమస్య ఏర్పడింది. ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ప్రోడక్ట్ మేనేజర్లు, ఇంజనీర్లు, డేటా సైన్స్ నిపుణులు ఉన్నారు. ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత దాదాపుగా 50 శాతం మంది ఉద్యోగులను తొలగించారు మస్క్. తాజాగా మరో 10 శాతం మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంత చేసుకున్న ప్రపంచ కుబేరుడు..ట్విట్టర్ లో తన మార్క్ చూపిస్తున్నాడు. వచ్చీ రావడంతోనే నలుగురు కీలక ఉద్యోగులతో పాటు ట్విట్టర్ బోర్డును రద్దు చేసి తానే ఏకైక డైరెక్టర్ గా ఉన్నాడు. ట్విట్టర్ బ్లూ టిక్ ఉన్నవారికి నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందే అని మస్క్ స్పష్టం తీసుకువచ్చారు.