RSS: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల పదేపదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై ఆర్ఎస్ఎస్ స్పందించింది. రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ఆర్ఎస్ఎస్ వాస్తవికతను చూడాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేమ హోసబాలే అన్నారు. స్వలింగ వివాహాలపై కేంద్రం దృష్టితో తాము ఏకీభవిస్తున్నామని, ఆడ, మగ వారి మధ్యే వివాహం జరుగుతుందని హోసబాలే అన్నారు.
Read Also: India On Pakistan: మళ్లీ కాశ్మీర్ ప్రస్తావన.. పాక్ “టెర్రరిస్టుల ఎగుమతిదారు” అంటూ భారత్ ఆగ్రహం
రాహుల్ గాంధీ రాజకీయ ఎజెండా కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాజకీయ రంగంలో ఆర్ఎస్ఎస్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా రాహుల్ గాంధీ మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ఆయన అన్నారు. భారత్‌ను జైలుగా మార్చిన వారికి దేశంలో ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యానించే హక్కు లేదు అని రాహుల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ ముస్లిం మేధావులు, ఆధ్యాత్మిక గురువులను వారి ఆహ్వానం మేరకే కలుస్తున్నామని ఆయన అన్నారు.