Umesh Pal Case: ఉత్తర్ ప్రదేశ్ లో ఉమేష్ పాల్ హత్య కేసులో ఎన్ కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఒక నిందితుడు ఎన్ కౌంటర్ లో చనిపోగా.. తాజాగా మరో నిందితుడు విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ ఎన్ కౌంటర్లో హతం అయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ మెడ, ఛాతీ, తొడపై బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.కౌంధియారా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోతి, బెల్వా మధ్య ఉదయం 5.30 గంటలకు ఎన్‌కౌంటర్ జరిగిందని ధూమంగంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేష్ కుమార్ మౌర్య తెలిపారు.
ఇదిలా ఉంటే తన భర్తను సోమవారం తెల్లవారుజామున తీసుకెళ్లి బూటకపు ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హతమార్చారని ఉస్మాన్ భార్య సుహాని ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కానిస్టేబుల్ నరేంద్ర పాల్ చేతికి కూడా గాయాలయ్యాయి. 2005లో రాజు పాల్ హత్య కేసులో ఉమేష్ పాల్ ప్రత్యక్షసాక్షిగా ఉన్నారు. ఫిబ్రవరి 24న ధూమన్ గంజ్ లోని తన ఇంటి నుంచి బయటకు వస్తున్న ఉమేష్ పాల్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉమేష్ పాల్ అక్కడికక్కడే మరణించగా, ఆయన గన్ మెన్లు చికిత్స పొందుతూ మరణించారు.
Read Also: Ukraine War: రష్యా సైనికుల అకృత్యాలు.. నాలుగేళ్ల చిన్నారిపై దారుణం..తల్లిపై సామూహిక అత్యాచారం..
ఈ ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. మాఫియాను మట్టిలో కలిపేస్తానని అసెంబ్లీలో యోగీ సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత నుంచి ఈ కేసులో నిందితులుగా ఉన్నవారంతా ఎన్ కౌంటర్లలో హతం అవుతున్నారు. ఉమేష్ పాల్ హత్యలో నిందితుడిగా ఉన్న వ్యక్తిని గతంలో ప్రయాగ్ రాజ్ లోని నెహ్రూ పార్క్ నిందితుడు అర్బాజ్ ను ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, జిల్లా పోలీసులు ఎన్ కౌంటర్ లో లేపేశారు.
2005లో గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు అలిక్ అహ్మద్ ముఠా రాజుపాల్ ను హత్య చేశారు. రాజు పాల్ 2005లో బీఎస్పీ తరుపున పోటీ చేసి అలహాబాద్ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ ఎన్నికల్లో మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ తమ్ముడు ఖలీద్ అజీమ్ ను ఓడించారు. ఈ ఓటమితో అతిక్, అతని తమ్ముడే రాజుపాల్ ను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం నిందితులు అంతా జైలులో ఉన్నారు.