పవర్ స్టార్ పవర్ణ్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హిట్ సినిమా They Call Him OGతో ఇండస్ట్రీలో దర్శకుడు సుజీత్ పేరు మారుమోగింది. చాలా కాలంగా హిట్ లేని పవర్ స్టార్ కు హిట్ ఇచ్చాడు సుజీత్. దాంతో ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ కు వరుసగా భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు సుజిత్. అలానే పలు ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి సుజీత్ కు అడ్వాన్స్ లు వస్తున్నాయట.
Also Read : NTRNeel : ‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ కు తల్లిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్?
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, కన్నడ ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ సుజీత్‌ను తమ బ్యానర్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ కోసం లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రభాస్ తో మరోసారి సినిమా చేసేందుకే సుజిత్ ను లాక్ చేశారని టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సాహూ ఓ మోస్తారు సక్సెస్ అయినా కూడా సుజిత్ వర్క్ పట్ల ప్రభాస్ సూపర్ హ్యాపీ. రెబెల్ స్టార్ యాక్షన్ సస్టైలిస్ట్ గా సుజిత్ చాలా బాగా చుపించాడు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ తో సినిమా అంటే సుజిత్ ఇంకా గట్టిగా ప్లాన్ చేస్తానడంలో సందేహం లేదు. ప్రభాస్ తో తనకు యాక్షన్ కామెడీ సినిమా చేయాలనుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు సుజిత్. అన్ని అనుకున్నట్టు జరిగి సుజీత్ – ప్రభాస్ కాంబోపై త్వరలోనే అఫీషయల్ ప్రకటన రాబోతుంది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తాడని కూడా ఓ టాక్ వినిపిస్తోంది.