సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసి ఇంటి ముందు పడేశారు. జయప్రకాష్ (22) అనే యువకుడిని హత్య చేసి శవాన్ని ఇంటి ముందు పడేశారు. మృతుడు మేస్త్రి వర్క్ చేస్తూ జీవిస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోల్ చెందిన వ్యక్తిగా గుర్తింపు. బొల్లారం మున్సిపల్ కెబిఆర్ కాలనిలో నివసిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువకుడి […]
గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్–2, 3 ప్రాజెక్ట్ పనులకు సీఎం రేవంత్ రెడ్డి నేడు గండిపేట వద్ద శంకుస్థాపన చేయనున్నారు. 7,360 కోట్ల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్-2,3 ప్రాజెక్టు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి నగరానికి 20 టీఎంసీల నీరు తరలించనున్నారు. అందులో 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మరో రెండున్నర టీఎంసీలు మూసీ ప్రక్షాళన & జంట జలాశయాల పునరుజ్జీవనానికి వినియోగించనున్నారు. Also Read:CM Revanth […]
కరీంనగర్ జిల్లాలో ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. వీణవంక మండలానికి చెందిన మైనర్ బాలికను రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురిమిండ్ల శ్రీనివాస్ (32) పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆదివారం ఉదయం బాలిక కుటుంబ సభ్యులు వీణవంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతి చేసిన […]
భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి కోసం సెప్టెంబర్ 9 అంటె రేపు ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి లు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. వెనువెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు. “ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్”గా వ్యవహరించనున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి. మోడి. “ఎన్నికల […]
గాజాలో బందీలను విడుదల చేసే ఒప్పందానికి పాలస్తీనా ఉగ్రవాద సంస్థ అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం హమాస్‌కు ‘తుది హెచ్చరిక’ జారీ చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో “ఇజ్రాయెల్ నా షరతులను అంగీకరించింది. ఇప్పుడు హమాస్ కూడా అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది” అని రాసుకొచ్చారు. ‘ షరతులను అంగీకరించకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని నేను హమాస్‌ను హెచ్చరించాను. ఇది నా చివరి హెచ్చరిక, ఇక మరో అవకాశం ఉండదు!’ […]
హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. దారులన్నీ గణపయ్య విగ్రహాలతో హుస్సేన్ సాగర్ వైపు పయనమయ్యాయి. గణపయ్య భక్తులు ఆటపాటలతో శోభాయాత్రాలో పాల్గొంటున్నారు. గణేష్ నిమజ్జనం వేళ నగరమంతా సందడి వాతావరణం నెలకొంది. నగరంలో అత్యంత విశిష్టత కలిగిన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఈ ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొనగా బడా గణేషుడు హుస్సేన్ సాగర్ కు తరలివెళ్లాడు. Also Read:KantaraChapter1: కాంతారా -1 మలయాళ […]
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సిబ్బంది వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ సూద్ ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు. నిన్న శ్రీశైలం వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వచ్చారు ప్రవీణ్ సూద్. జూబ్లీహిల్స్ లోని సిబిఐ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సీబీఐ గెస్ట్ హౌస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఢిల్లీలోని ఎర్రకోటలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గత మంగళవారం ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణం నుంచి దాదాపు కోటి రూపాయల విలువైన కలశం ఎత్తుకెళ్లారు. ఎర్రకోట ప్రాంగణంలో జరిగిన మతపరమైన వేడక సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కలశం దాదాపు 760 గ్రాముల బంగారంతో తయారు చేశారు. దానిపై దాదాపు 150 గ్రాముల వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలు పొదిగి ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకుని పరిశీలించారు. Also Read:US Tariffs: 2 నెలల్లో భారత్ […]
ఆసియా కప్ T20 2025 కోసం భారత జట్టు శుక్రవారం దుబాయ్ చేరుకుంది. జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మాన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, హార్దిక్ పాండ్యా ICC అకాడమీ గ్రౌండ్లో కనిపించారు. అయితే, జట్టు రాక కంటే హార్దిక్ లుక్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఆసియా కప్ T20 సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది. భారతదేశం సెప్టెంబర్ 10న UAEతో తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 14న […]