రవినాయుడు, శాప్ ఛైర్మన్ మాజీ మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రవినాయుడు మాట్లాడుతూ.. రోజాను అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు.. వారెంట్ ఉంటే చాలు అని తెలిపారు. రోజా అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది.. రోజా జైలుకు వెళ్ళడం గ్యారంటీ.. నిరుపేదల క్రీడాకారులకు చెందిన 119కోట్లను రోజా దోచేశారు.. రోజా నోటి దూల వల్లే వైసిపికి 11సీట్లు వచ్చాయి.. Also Read:Amit Shah: మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం.. […]
నందిగామ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “2004 లో గెలిచి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది.. హైదరాబాద్ అభివృద్ధి చేశామని.. రాష్ట్ర విభజన తర్వాత 2014 లో మళ్ళీ గెలిచాము.. చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ముఖ్యం.. కార్యకర్తలు యక్టీవ్ గా లేకపోతే పార్టీకి కష్టం.. మొదటి రోజు నుంచే కార్యకర్తల కోసం కష్టపడుతున్నా.. పార్టీని సమర్ధవంతంగా స్ట్రీమ్ లైన్ చెయ్యడం కోసం ఎంతో కష్టపడుతున్నాం.. ఏ పార్టీ కార్యాలయంలో […]
అప్పు నిప్పుతో సమానం.. నిలువునా కాల్చేస్తది అనడంలో సందేహం లేదు. తీరని అప్పు ఎప్పటికైనా ముప్పే. తీసుకున్న అప్పు తీర్చనందుకు ప్రాణాలు తీసిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాజా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. 6 వేల అప్పు తిరిగివ్వలేదని.. ప్రియుడితో కలిసి మహిళను హత్య చేసింది మరో మహిళ. వికారాబాద్ జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ లో వీడిన హత్య మిస్టరీ… నిందితులను పట్టుకున్న పోలీసులు.. బొంరాస్‌పేట్ మండలం చౌదర్‌పల్లికి […]
వైసీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఖాదర్ భాష టీడీపీ, జనసేనలపై మండిపడ్డాడు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ కు రెండు రాష్ట్రాల ముస్లిం సమాజం కృతజ్ఞతలు చెబుతోందని అన్నాడు. ఖాదర్ భాష మాట్లాడుతూ.. చంద్రబాబు సూచించిన మూడు సవరణల వల్ల ఒరిగేదేమీ లేదు.. ముస్లింలను నిలువునా మోసం చేసి వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చింది టీడీపీ.. వైసీపీ లోక్ సభలో వ్యతిరేకంగా ఓటు వేసిందని.. రాజ్యసభ లో అనుకూలంగా ఓటు వేసిందని […]
కొన్ని రోజుల క్రితం ముగ్గురు పిల్లలను కన్న తల్లే కర్కశంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అమీన్ పూర్ లో రజిత, చెన్నయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరి సంసారంలో గెట్ టు గెదర్ పార్టీ చిచ్చుపెట్టింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లిన రజిత టెన్త్ క్లాస్ లో తనతోపాటు చదువుకున్న శివతో పాత పరిచయానికి బీజం పడింది. ఇంకేముంది.. భర్త అంటే ఇష్టం లేని రజిత శివతో […]
బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై అధికార యంత్రాంగం ఇకనైనా వాస్తవాలు గ్రహించాలని అన్నారు. గ్రామంలో 1,295 మందిని పరీక్ష చేస్తే 62 క్యాన్సర్ కేసులు వచ్చాయని తెలిపారు. సాధారణ కంటే మూడు రేట్లు అధికంగా బిక్కవోలు గ్రామంలో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. జాతీయ క్యాన్సర్ కేసు యావరేజ్ కంటే ఇది ఆరు రెట్లు అధికంగా ఉందని వెల్లడించారు. Also Read:Ponguru Narayana: 30 వేల […]
విజయవాడలో మెప్మా వన్ డే వర్క్ షాప్ నిర్వహించారు. మహిళాకాశం పేరిట మెప్మా వెబ్ సైట్, మెప్మా మొబైల్ యాప్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. మహిళా వ్యాపారుల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక లక్ష్యంతో వర్క్ షాప్ నిర్వహించారు. వన్ డే వర్క్ షాప్ కి మెప్మా డైరెక్టర్ తేజ భరత్, మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 30 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయడమే లక్ష్యంగా మెప్మా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఉన్న […]
బాబూ జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ వారసత్వాన్ని పుణిపుచ్చుకుని దేశ అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు జగజ్జీవన్ రామ్.. అట్టడుగు వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకే చంద్రబాబు పి 4 పథకం ప్రవేశ పెట్టారు..గత ప్రభుత్వం బాబూ జగజ్జీవన్ రామ్ విషయంలో చిన్న చూపు చూసింది.. దళితులు అంటేనే జగన్మోహన్ రెడ్డికి చులకన.. అందుకే […]
ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. తన మొదటి ఓవర్లోనే డేంజరస్ క్వింటన్ డికాక్(1) వికెట్ పడగొట్టాడు హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. దీంతో ఆతిథ్య జట్టు 14 పరుగుల వద్ద మొదటి […]
హైదరాబాద్ లో అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. బలమైన ఈదురు గాలులు వీస్తూ బీభత్సం సృష్టించాయి. కారుమబ్బులు ఆవరించి కుండపోత వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భారీగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలో వర్షంధాటికి చారిత్రక కట్టడం చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి దేవాలయం వైపున ఉన్న మినార్‌లో పై కప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. […]