భార్యలు, భర్తలను చంపడం, పిల్లలు తల్లిదండ్రులను చంపడం చూస్తుంటే మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో ఘటనలో తనను ప్రేమించినప్రియుడు మరొకరితో పెళ్లికి సిద్ధమవడంతో ఆ యువతి ప్రశ్నించింది. ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. చివరకు ప్రియుడు ప్రేమించిన యువతిని ఐదవ అంతస్తు నుంచి తోసేసి అంతమొందించాడు. ఈ ఘటన ఢిల్లీలోని అశోక్ నగర్‌లో చోటుచేసుకుంది. ఈ కేసులో 26 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నివాసి తౌఫీక్‌గా గుర్తించారు.
Also Read:RK Roja: మళ్లీ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన రోజా..! తొక్కిపెట్టి వారి నార తీయాలి కదా..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తౌఫీక్, నేహా అనే యువతీ యువకులు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని తెలిపారు. అయితే తౌఫీక్ కుటుంబం మరో యువతితో పెళ్లి చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న నేహా ప్రియుడు తౌఫీక్ తో గొడవపడింది. దీంతో నేహాను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన తౌఫీక్, నేహా ఇంటికి మారువేశంలో వెళ్లి ఆమెను భవనం పైనుంచి తోసేశాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన నేహా కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన ఆమెను గురు తేగ్ బహదూర్ (జిటిబి) ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నేహా మృతిచెందింది.
Also Read:Kannappa : ట్రోల్స్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం.. కన్నప్ప టీమ్ వార్నింగ్..!
నేహా కుటుంబ సభ్యులు జ్యోతి నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తౌఫీక్ ను అరెస్టు చేశారు. విచారణలో నేహా ఇంటికి మారువేశంలో వెళ్లానని నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నేహా కుటుంబ సభ్యులు మాత్రం ఈ వాదనను ఖండిస్తోంది. నేహాకు తౌఫీక్ తో ప్రేమాయణం లేదని, ఆమె అతనికి రాఖీ కట్టేదని ఆమె తండ్రి తెలిపారు. దాదాపు మూడు సంవత్సరాలుగా తౌఫీక్ తమకు తెలుసునని, అతను తరచుగా తమ ఇంటికి వచ్చేవాడని కుటుంబం చెబుతోంది. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.