తెలంగాణ క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాబినెట్ సుదీర్ఘంగా జరిగిందన్నారు. ఈనెల 16న సీఎం చేతుల మీదుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా చెల్లించాము.. వ్యవసాయం దండగ కాదు పండగ అని చెబుతున్నాం.. రాష్ట్ర రైతుల పక్షాన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపాము.. రేపు సెక్రటేరియట్ ముందు రైతు సంబురాలు జరపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
Also Read:Telangana Cabinet Meeting: ముగిసిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం
రైతు పక్షపాతి ప్రభుత్వం.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గత ప్రభుత్వం మర్చిపోతే… ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసాం.. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ లలో నవంబర్ లోపు తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం.. 201 కిలోమీటర్ల చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కు క్యాబినెట్ ఆమోదం.. నాటి ప్రభుత్వం 2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 400 టీఎంసీల ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. బనకచర్ల అనే బంకను ఈ ప్రభుత్వానికి రుద్దాలని చూసింది ప్రతిపక్షం..
Also Read:CM Chandrababu: డబుల్ ఇంజిన్ సర్కారు ఎలా ఉంటుందో చూపించాం.. ఇదే జోరు కొనసాగిద్దాం..
గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కను కూడా వదులుకోము.. ఈ విషయంలో కృతనిశ్చయంతో క్యాబినెట్ పని చేస్తుంది.. నాటి ప్రభుత్వంలో జరిగిన విషయాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.. జూలై మొదటి వారంలో బనకచర్ల విషయంలో కేంద్రానికి ఏఏ విధంగా ఫిర్యాదు చేసాము ప్రజెంట్ చేస్తాం.. రెండు రాష్ట్రాలకు చెందిన సమస్యలను విభజన చట్టంలో ఉన్న అంశాలను హైలెవెల్ కమిటీ ముందు చర్చించాలని నిర్ణయం.. పీసీ ఘోష్ కమీషన్ కు కాళేశ్వరంకు సంబంధించిన క్యాబినెట్ సమావేశాల వివరాలు జూన్ 30లోపు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.
క్యాబినెట్ సబ్ కమిటీ వివరాలు కూడా లిఖిత పూర్వకంగా పీసీ ఘోష్ కమీషన్ కు ఇస్తాం.. క్రీడా పాలసీని క్యాబినెట్ ఆమోదించింది.. నెలకు రెండు సార్లు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తూ ఆ సమావేశాల పై ప్రతి మూడు నెలలకు ఒకసారి అమలు జరుగుతుందా లేదా అనేది సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయం.. సంగారెడ్డి జిల్లాలో రెండు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు.