బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. నేడు తులం పసిడి ధర రూ. 170 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,18, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,265 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరిగింది. దీంతో రూ. 92,650 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం […]
కేరళ హైకోర్టు పబ్లిక్ వాష్‌రూమ్‌లకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. పెట్రోల్ పంపుల వద్ద ఉన్న టాయిలెట్లు సాధారణ ప్రజల ఉపయోగం కోసం కాదని తెలిపింది. పెట్రోల్ పంపుల వద్ద ఉన్న టాయిలెట్లను బహిరంగంగా బహిర్గతం చేయకూడదని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పంపుల యజమానుల తరపున కోర్టులో పిటిషన్ దాఖలైంది. పెట్రోల్ పంపుల వద్ద ఉన్న టాయిలెట్లను ప్రజా సౌకర్యంగా వర్గీకరించడంపై రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలపై పంపుల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. Also Read:ENG […]
రాజస్థాన్‌లోని ఝుంఝునులో, పూనమ్ అనే 45 ఏళ్ల మహిళ తనకంటే 14 సంవత్సరాలు చిన్నవాడైన వాటర్ సప్లయర్ కృష్ణ కుమార్‌తో ప్రేమాయణం నడిపింది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో ఆ మహిళ, తన ప్రేమికుడితో కలిసి తన భర్తను చంపేసింది. హత్య తర్వాత, ప్రమాదంగా చూపించడానికి ప్రయత్నించారు. పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేయడంతో అసలు యవ్వారం బయటపడింది. ఈ కేసులో నిందితురాలు మహిళ పూనమ్, ఆమె ప్రేమికుడు కృష్ణ కుమార్‌లను పోలీసులు […]
ఈ సంవత్సరం QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026లో భారతీయ విశ్వవిద్యాలయాలు సత్తాచాటాయి. దాదాపు 50% భారతీయ సంస్థల ర్యాంకింగ్ మెరుగుపడింది. ఇది దేశ ఉన్నత విద్యా వ్యవస్థకు ఒక పెద్ద విజయంగా పరిగణించబడింది. ఐఐటీ ఢిల్లీ టాప్ లో నిలిచింది. ఈ సంస్థ ప్రపంచ ర్యాంకింగ్‌లో 123వ స్థానానికి చేరుకుంది. గతసారి భారత్ లో మొదటి స్థానంలో నిలిచిన IIT బాంబే ఇప్పుడు రెండవ స్థానంలో ఉంది. అయితే, దాని ర్యాంకింగ్ కొద్దిగా తగ్గింది – […]
గుజరాత్లో హనీట్రాపింగ్ ఆరోపణలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కీర్తి పటేల్‌ను అరెస్టు చేశారు. గుజరాత్‌కు చెందిన ఒక బిల్డర్ నుంచి రెండు కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీర్తి పటేల్‌ను అహ్మదాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న కీర్తి పటేల్‌పై గత ఏడాది జూన్ 2న సూరత్‌లో కేసు నమోదు చేశామని, కొంతకాలం తర్వాత కోర్టు కూడా ఆమెపై వారెంట్ జారీ చేసిందని పోలీసులు తెలిపారు. Also […]
ఇరాన్ పై దాడి ప్రణాళికకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. తుది ఉత్తర్వుల కోసం వేచి ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ట్రంప్ తన సీనియర్ సహచరులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇరాన్ పై దాడికి ఆమోదం తెలిపారు. తుది ఉత్తర్వు తర్వాత దాడి జరుగుతుందని, ఈ సందర్భంగా ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో చూడాలని కోరారు. ట్రంప్ సమావేశానికి ముందు, ఇరాన్ సుప్రీం […]
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విద్యార్థులను మొదట ఇరాన్ నుంచి అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి వారిని భారత్ కు తీసుకువచ్చారు. ఈ విద్యార్థులలో, 90 మంది జమ్మూ, కాశ్మీర్ కు చెందిన వారు. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల కుటుంబాలు విమానాశ్రయంలో తమ పిల్లల కోసం ఆసక్తిగా ఎదురు చూశాయి. రాజస్థాన్‌లోని […]
మెదక్ లో కామారెడ్డి డిక్లరేషన్ సాధన కోసం బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. UPF, తెలంగాణ జాగృతి బీసీల కోసం పోరాడుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు. మెదక్ లో బీసీల సమావేశం పెడితే కొందరు […]
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిపై కేసు నమోదు కాగా సిట్ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ట్యాప్ చేసిన నెంబర్లలో తన నెంబర్ ఉండడంతో కొంత సమాచారం కావాలని సిట్ కోరడంతో సిట్ కార్యాలయానికి వెళ్లారు. సిట్ కు తన స్టేట్ మెంట్ ను ఇచ్చాడు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డితో పాటు నా ఫోన్ […]
హైదరాబాద్ లో డిఫెన్స్ మద్యం పట్టుబడింది. మల్కాజిగిరిలో 37 బాటిల్లు, మేడ్చల్ లో 24 బాటిల్ల మద్యం సీజ్ చేశారు అధికారులు. ఎక్స్ ఆర్మీ పర్సన్ ను అరెస్ట్ చేశారు. ఎక్స్ ఆర్మీకి చెందినటువంటి ఇద్దరూ వ్యక్తులు రెండు చోట్ల మద్యం అమ్మకాలు జరుపుతున్నారు అనే సమాచారం మేరకు మల్కాజిగిరి ఏఈఎస్ ముకుంద రెడ్డి బృందం రెండు చోట్ల దాడి చేసి 37 డిఫెన్స్ మద్యం బాటిల్లను సీజ్ చేశారు. పట్టుబడినటువంటి టిఫిన్స్ మద్యం బాటిళ్లు కర్ణాటక […]