భారీగ పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతున్నాయి. అంతకంతకు పెరుగుతూ దడపుట్టిస్తున్నాయి. నేడు మరోసారి గోల్డ్ ధరలు భగ్గుమన్నాయి. ఒక్కరోజులోనే తులం గోల్డ్ ధర రూ. 930 పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కిలో సిల్వర్ ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,588, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,705 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 850 పెరిగింది. దీంతో రూ.97,050 వద్ద అమ్ముడవుతోంది.
Also Read:CM Revanth Reddy: లక్ష కోట్ల ఆస్తి ఎలా కేసీఆర్?.. ఆ టెక్నిక్ ఏందో తెలంగాణ యువతకు చెప్పండి!
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 930 పెరిగింది. దీంతో రూ. 1,05,880 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97, 200 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,06,030 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,36,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,26,000 వద్ద ట్రేడ్ అవుతోంది.