పద్మావతి ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ చోటుచేసుకుంది. రైళ్లో ప్రయాణిస్తున్న దొంగలు రెచ్చిపోయారు. మూడు బోగీల్లో చోరీకి పాల్పడ్డారు. ముగ్గురు మహిళల నుంచి 40 గ్రాముల బంగారం ఆపహరించారు. బంగారం అపహరణకు గురవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు. కావలి – శ్రీ వెంకటేశ్వర పాలెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో ప్రయాణం చేస్తూనే చోరికి పాల్పడి పరారయ్యారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. […]
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఓ తండ్రి ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు హిరణ్య (9), లీలసాయి (7)గా గుర్తించారు. అయితే, రెండు నెలల కిందట పిల్లలను తన భర్త రవిశంకర్ వద్ద వదిలి వెళ్లిందట తల్లి చంద్రిక.. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురై.. ఆత్మహత్య చేసుకుందామని భావించి ఉంటాడని.. తన పిల్లలను ఎవరు పోషిస్తారనే వారిని కూడా హత్య చేసి ఉంటాడని అంతా భావించారు. Also Read:Pawan Kalyan: యోగాను ప్రపంచ వ్యాప్తం […]
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా విశాఖలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సహా ప్రముఖులు హాజరయ్యారు. ఆర్కేబీచ్ నుంచి భీమిలి వరకు కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేశారు. యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. Also Read:Neeraj Chopra: జూలియన్ వెబర్ పై ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్ […]
పారిస్ డైమండ్ లీగ్ 2025 పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మొదటి స్థానాన్ని గెలుచుకున్నాడు. జూన్ 20న (శుక్రవారం) పారిస్‌లో జరిగిన ఈ ఈవెంట్లో నీరజ్ తన సమీప ప్రత్యర్థి జర్మనీకి చెందిన జూలియన్ వెబర్‌ను ఓడించాడు. గత రెండు టోర్నమెంట్లలో నీరజ్ వెబర్ చేతిలో ఓడిపోయాడు, కానీ ఇప్పుడు ఆ రెండు ఓటములకు ప్రతీకారం తీర్చుకున్నాడు. పారిస్ డైమండ్ లీగ్‌లో, నీరజ్ చోప్రా తన మొదటి ప్రయత్నంలోనే […]
ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైకులు, కార్లు, ఇతర వాహనాలను జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అవి పాడైపోయాక కూడా ఇంట్లోనే భద్రంగా భద్రపరుచుకుంటుంటారు. వాటిని కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని నదియాద్‌లోని ఉత్తర్సంద గ్రామంలో ఒక భావోద్వేగ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో బైక్ ప్రియుడైన యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా అతని కుటుంబం అతని బైక్‌తో అంతిమ వీడ్కోలు పలికింది. అంత్యక్రియలు నిర్వహిస్తున్నప్పుడు, కుటుంబం అతనికి ఇష్టమైన బైక్‌తో పాతిపెట్టాలని నిర్ణయించుకుంది. అతను […]
ఇటీవలి కాలంలో కాబోయే అల్లుడితో అత్త పారిపోవడం, కాబోయే కోడలిని మామ పెళ్లి చేసుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా యూపీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రాంపూర్‌లోని ఓ మామ తనకు కాబోయే కోడలిని వివాహం చేసుకున్నాడు. బన్సనాలి గ్రామంలో నివసిస్తున్న ముగ్గురు పిల్లల తండ్రి తన మైనర్ కొడుకు వివాహాన్ని మొదట బలవంతంగా ఒక అమ్మాయితో నిశ్చయించి, ఆ తర్వాత అదే అమ్మాయితో పారిపోయి ఆమెను వివాహం చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కొడుకు […]
ప్రస్తుత రోజుల్లో ఇంటికో టూవీలర్ కామన్ అయిపోయింది. వివిధ అవసరాల కోసం బైకులను యూజ్ చేస్తున్నారు. అయితే వాహనదారులు తరచుగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ద్విచక్ర వాహనాల్లో కొత్త సేఫ్టీ ఫీచర్ ను తప్పనిసరి చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి దేశంలో విక్రయించే అన్ని టూవీలర్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ […]
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం రానే వచ్చింది. ప్రపంచ దేశాలు యోగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం 24 గంటల ముందే కౌంట్ డౌన్ మహాత్సవాలు జరుపుకుంటున్నారు. యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. నిత్యం యోగా చేయడం వల్ల ఫిజికల్ హెల్త్ తో పాటు, మెంటల్ హెల్త్ మెరుగవుతుందని భావిస్తుంటారు. అన్ని సమస్యలకు యోగా పరిష్కారంగా చెబుతుంటారు. […]
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో 6,180 టెక్నీషియన్ ఖాళీల భర్తీ కోసం రెడీ అయ్యింది. జూన్ 16 నాటి ఎంప్లాయ్మెంట్ న్యూస్‌లో షార్ట్ నోటిఫికేషన్ ను ప్రచురించింది. జూన్ 27 నాటికి వివరణాత్మక ప్రకటన (CEN 02/2025) విడుదలవుతుందని భావిస్తున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 28న ప్రారంభమై జూలై 28న రాత్రి 11.59 గంటలకు ముగుస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు RRB వెబ్సైట్ rrbcdg.gov.in […]
బంగారం ధరలు భారీగా పడిపోయాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 600 తగ్గింది. తగ్గిన ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,048, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,210 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 తగ్గింది. దీంతో రూ. 92,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల […]