ఆయన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. దేశ రక్షణలో భాగమై బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నాడు. కానీ నైతిక విలువలను మాత్రం మరిచాడు. భర్తగా, తండ్రిగా బాధ్యత నిర్వర్తించాల్సిన వాడు మూర్కుడిలా వ్యవహరించాడు. భార్య, కూతురును కట్టుబట్టలతో రోడ్డుపైన పడేశాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీహరి ఈ దారుణానికి ఒడిగట్టాడు. శ్రీహరికి 2011 స్రవంతితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు. కాగా 2019 నుండి అత్త, భర్త శ్రీహరి భార్య స్రవంతిని గృహహింస పెడుతున్నాడు. వేధింపులతో విసిగిపోయిన స్రవంతి పోలీసులను ఆశ్రయించింది.
AlsoRules Change: నేటి నుంచి మారనున్న రూల్స్ ఇవే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో సహా మారేవి ఇవే.. Read:
సమస్య పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన పైరవీలతో సమస్య పరిష్కారం కాకుండా శ్రీహరి తప్పించుకుంటున్నాడు. ఈ క్రమంలో చిగురుమామిడి పోలీస్ స్టేషన్ సమీపంలో భార్య స్రవంతిని, 12 ఏళ్ల కూతురిని నిర్ధాక్షణంగా సామాగ్రితో సహా రోడ్డున పడేశాడు. పోలీసులు చెప్పిన వినకుండా స్రవంతిని, ఆమె కూతురును ఇంట్లోకి రానివ్వకుండ అత్త, భర్త అడ్డుకున్నారు. స్రవంతి, ఆమె కూతురు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చిగురుమామిడి బస్టాండ్ లో తలదాచుకున్నారు. ఇది తెలిసిన వారు వీడేం మనిషిరా బాబు అంటూ మండిపడుతున్నారు.