Delhi BMW crash: బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో కీలక ట్విస్ట్.. నిందితురాలు షాకింగ్ స్టేట్‌మెంట్
- ఢిల్లీ బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో కీలక ట్విస్ట్
- నిందితురాలు షాకింగ్ స్టేట్‌మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి నవజ్యోత్ సింగ్ (52) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. భార్య సందీప్ కౌర్‌తో కలిసి ఇంటికి వెళ్తుండగా బీఎండబ్ల్యూ కారు ఢీకొని మృతిచెందారు. ఇక సందీప్ కౌర్ తీవ్రగాయాలు పాలయ్యారు. అయితే ప్రమాదం జరిగిన సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. కానీ బాధితులను 19 కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రికి నిందితురాలు తరలించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారకురాలైన బీఎండబ్ల్యూ కారు యజమాని గగన్‌ప్రీతి కౌర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులను దగ్గరలో ఉన్న ట్రామా సెంటర్‌కు తీసుకెళ్లకుండా 19 కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారని నిందితురాలిని అడగ్గా షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. తనకు ఆ ఆస్పత్రి మాత్రమే తెలుసని.. కోవిడ్-19 సమయంలో తన పిల్లలను అక్కడే చేర్చినట్లు చెప్పుకొచ్చింది. వెంటనే ఆ విషయం గుర్తుకొచ్చి అక్కడికి తీసుకెళ్లినట్లు గగన్‌ప్రీతి చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులు నివ్వెరపోయారు.
ఇది కూడా చదవండి: Indore: ఇండోర్‌లో దారుణం.. ట్రక్కు బీభత్సం.. ముగ్గురు మృతి
Also Read
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
అయితే బాధితురాలు సందీప్ గౌర్ మాత్రం ఈ వాదనను తోసిపుచ్చారు. ప్రమాదం జరిగినప్పుడు తన భర్త బతికే ఉన్నాడని.. దగ్గరలోనే ఆస్పత్రి ఉందని.. అక్కడికి తీసుకెళ్లమని అడిగినా గగన్‌ప్రీతి పట్టించుకోలేదని ఆరోపించింది. అలాగే బాధితురాలి కుమారుడు కూడా అదే వాదించాడు. ఉద్దేశపూర్వకంగానే దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారని.. దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి ఉండుంటే తన తండ్రి బతికేవాడని వాపోయాడు.
ఇది కూడా చదవండి: Train Video: ఏసీ కోచ్‌లో మహిళ ధూమపానం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
నిందితురాలు గగన్‌ప్రీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రెండు రోజులు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఇక బెయిల్ దరఖాస్తు చేసుకోగా.. సెప్టెంబర్ 17న కోర్టు విచారించనుంది. నవజ్యోత్ సింగ్.. భార్యతో కలిసి బంగ్లా సాహిబ్ గురుద్వారాను సందర్శించి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!