ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై మరో బాంబ్ పేల్చారు. ఉద్దేశపూర్వకంగా లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిందని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియా ప్రజెంటేషన్ ఇచ్చారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సౌదీ అరేబియాలో పర్యటించారు. ఇక రియాద్‌లో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. పరస్పరం రక్షణ ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి.
వాళ్లిద్దరిది కాటికి కాలు చాపిన వయసు. ఎప్పుడు పోతారో తెలియదు. అలాంటి వయసులో ప్రేమలో పడ్డారు ఇద్దరు వృద్ధులు. భారతీయ వృద్ధుడిని పెళ్లి చేసుకునేందుకు ఏకంగా అమెరికా నుంచి వచ్చేసింది వృద్ధురాలు. కానీ మరణాన్ని ఊహించక హత్యకు గురైంది. పంజాబ్‌లోని లూథియానాలో ఈ ఘోరం జరిగింది.
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10న అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయాడు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి చార్లీ కిర్క్ విశేష కృషి చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తుది నివేదిక రాలేదు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు సంస్థలు ఇంకా బయటపెట్టలేదు. ఏఏఐబీ మాత్రం 15 పేజీల ప్రాథమిక రిపోర్టును బయటపెట్టింది.
జాతీయవాది చార్లీ కిర్క్ హత్య తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాంటీఫాను ‘ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించారు. చార్లీ కిర్క్‌ను హత్య చేసిన నిందితుడు యాంటీఫాకు చెందిన వాడిగా ఎఫ్‌బీఐ అనుమానించింది.
మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కుటుంబం అదృశ్యమైంది. గత నాలుగు రోజులుగా ఆమె కుటుంబం కనిపించడం లేదు. మహారాష్ట్ర అంతటా పోలీసులు గాలిస్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు.
ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశ, విదేశాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులంతా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఇలా ఆయా దేశాలకు సంబంధించిన నాయకులంతా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ దెబ్బేంటో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు రుచి చూశాయని.. ఈ మేరకు జైషే ఉగ్ర సంస్థ అంగీకరించిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ బుధవారం 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు.
చార్లీ కిర్క్.. ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది సెప్టెంబర్ 10న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంతాపం వ్యక్తం చేశారు. ఇక అమెరికా ప్రజలు కన్నీటిపర్యంతం అయ్యారు.