దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి నవజ్యోత్ సింగ్ (52) మరణానికి కారణమైన బీఎండబ్ల్యూ కారు యజమాని గగన్‌ప్రీత్ కౌర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్పత్రి నుంచి నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో పిల్లర్ నంబర్ 67 సమీపంలో బైక్‌పై భార్య సందీప్ కౌర్‌తో నవజ్యోత్ సింగ్ ఇంటికి వెళ్తున్నారు. ఇంతలో బీఎండబ్ల్యూ కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. అక్కడికక్కడే నవజ్యోత్ ప్రాణాలు కోల్పోగా.. భార్య సందీప్ కౌర్ తీవ్రంగా గాయపడ్డారు. భార్యాభర్తలిద్దరూ బంగ్లా సాహిబ్ గురుద్వారాను సందర్శించి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
ఇది కూడా చదవండి: Earthquake: ఓ వైపు భూప్రకంపనలు.. ఇంకోవైపు వణికిన పిల్లల వార్డు.. అస్సాం నర్సులు ఏం చేశారంటే..!
ఇక కారులో భర్త పరీక్షిత్‌తో కలిసి గగన్‌ప్రీత్ కౌర్ వేగంగా వెళ్తుండగా బైక్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న దంపతులకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే నవజ్యోత్ సింగ్, ఆయన భార్య సందీప్ కౌర్‌ను జీటీబీ నగర్‌లోని న్యూలైఫ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఆస్పత్రి నిందితురాలు గగన్‌ప్రీత్ కుటుంబానికి సంబంధించింది కావడం విశేషం. ఆమె తండ్రి ఆస్పత్రి యాజమాన్యంలో భాగంగా ఉన్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. గురుగ్రామ్ నివాసితులైన గగన్‌ప్రీత్, పరీక్షిత్ మక్కర్ దంపతులను టాక్సీలో ఆస్పత్రికి తరలించారు. ఇది ప్రమాద స్థలం నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాస్తవంగా పక్కనే ఆస్పత్రి ఉండగా.. దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో ఆస్పత్రికి తరలించడానికి కారణం నిందితురాలికి సంబంధించిన ఆస్పత్రినే కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Acharya Devvrat: మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణం
తన తల్లిదండ్రులను దూరంలో ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారని నవజ్యోత్ సింగ్ కుమారుడు నవనూర్ సింగ్ ప్రశ్నించాడు. ప్రమాద స్థలిలో ఉన్న ఆస్పత్రి దగ్గరకు కాకుండా 19 కిలోమీటర్లు ఎందుకు తీసుకెళ్లారని నిలదీశాడు. తన తండ్రిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లుంటే బతికే వాడని కుమారుడు నవనూర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే తన తండ్రి చనిపోలేదని.. కొనఊపిరి ఉందని చెప్పాడు. ఈ కేసును తారుమారు చేసేందుకు ఇంత దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకొచ్చారని ఆరోపించాడు.