Zepto, Blinkit, Flipkart: ఇంట్లో పాలు లేవా? రేషన్ అయిపోయిందా?.. కేవలం 10 నిమిషాల్లో ఆన్‌లైన్‌లో తెప్పించుకుందాం.. ఇలాంటి మాటలు ఈ రోజుల్లో సాధారణమైపోయాయి. కానీ, ఈసారి డిసెంబర్ 31న పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. నూతన సంవత్సరానికి ఒక రోజు ముందు గిగ్ వర్కర్స్, ముఖ్యంగా క్విక్ ఈ-కామర్స్ అండ్ ఫుడ్ డెలివరీ కంపెనీల డెలివరీ బాయ్స్ భారీ సమ్మెకు పిలుపునిచ్చారు. దీని ప్రభావంతో 8 నుండి 10 నిమిషాల్లో సరుకులు అందే సేవలు తీవ్రంగా అంతరాయం కలిగే అవకాశం ఉంది.
Vaikuntha Ekadashi: ముక్కోటి ఏకాదశి రోజునే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..?
డిసెంబర్ 31 అనేది ఆన్‌లైన్ ఆర్డర్లకు పీక్ డే. పార్టీలు, సెలబ్రేషన్ల కోసం ఆహారం, కిరాణా, పానీయాలు భారీగా ఆర్డర్ అవుతాయి. ఇలాంటి కీలక రోజునే గిగ్ వర్కర్స్ సమ్మెకు పిలుపునివ్వడం గమనార్హం. ఈ సమ్మెలో జెప్టో, బ్లింక్ఇట్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌ల డెలివరీ బాయ్స్ కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. గిగ్ వర్కర్స్ అంటే శాశ్వత ఉద్యోగం కాకుండా కాంట్రాక్ట్ లేదా ఫ్రీలాన్స్ విధానంలో పనిచేసే కార్మికులు. వీరిలో చాలామంది తక్కువ జీతాలు, భద్రత లేని పని పరిస్థితులు, అధిక పని గంటలతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే డిమాండ్లతో డిసెంబర్ 25న కూడా గిగ్ వర్కర్స్ సమ్మె చేశారు. ఇప్పుడు మళ్లీ డిసెంబర్ 31ను ఎంచుకోవడంతో ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ సేవలపై పెద్ద ఎత్తున ప్రభావం పడనుంది.
Russia Ukraine War: టెన్షన్.. టెన్షన్.. పుతిన్ నివాసం వద్ద ఉక్రెయిన్ డ్రోన్ దాడులు..
మీ ఇంటికి సరుకు 8 లేదా 10 నిమిషాల్లో చేరొచ్చు. కానీ ఆ 10 నిమిషాలు ఒక డెలివరీ బాయ్‌కు ఎంతటి ఒత్తిడిగా మారుతున్నాయో చాలామందికి తెలియదు. అదే వేగం కోసం వారు రోడ్లపై ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోందని వర్కర్స్ ఆరోపిస్తున్నారు. అల్ట్రా-ఫాస్ట్ డెలివరీ మోడల్‌ను నిలిపివేయాలన్నదే వారి ప్రధాన డిమాండ్. వినియోగదారుల సౌకర్యం కోసం తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు అంటున్నారు.
డెలివరీ బాయ్స్ ప్రధాన డిమాండ్లు:
* కనీస వేతనానికి సమానమైన ఆదాయానికి హామీ
* రోజుకు 8 గంటల పని విధానం, అదనపు పనికి ఓవర్‌టైమ్ వేతనం
* గంటలు, శ్రమ ఆధారంగా పారదర్శక చెల్లింపు విధానం.
* ప్రమాదాలు, అనారోగ్యాలకు బీమా మరియు సామాజిక భద్రత
* పొగమంచు సమయాల్లో రాత్రి 11 గంటల తర్వాత డెలివరీలు నిలిపివేయాలి
* ఒక్క కస్టమర్ ఫిర్యాదుతో విచారణ లేకుండా ID బ్లాక్ చేయకూడదు.