బుల్లితెర మీద చిన్న చిన్న సీరియల్స్ తీసి.. అలా అలా బాలీవుడ్ పలు చిత్రాలో సైడ్ క్యారెక్టర్‌లు చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది మృణాల్ ఠాకూర్. ప్రజంట్ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో సమానంగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తెలుగులో ‘సీతారామం’ సినిమాలో సీతగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఆ సినిమా ఆమె కెరీర్‌ను కొత్త మలుపు తిప్పింది అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన ‘హాయ్ నాన్న’తో తెలుగులో మరోసారి తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. మూడో సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, మృణాల్‌పై ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
Also Read : Rashmika-Vijay : రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్..
ఇటీవల తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ మృణాల్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నిజానికి తాను ఎప్పుడూ దక్షిణాది సినిమాల్లో నటిస్తానని అనుకోలేదని, అది తన జీవితంలో అనుకోకుండా దొరికిన అదృష్టమని చెప్పింది. ‘సీతారామం’ తర్వాత బాలీవుడ్‌లో తనను చూసే చూపే మారిపోయిందని, అందుకే తెలుగు సినిమాకు ఎప్పుడు రుణపడి ఉంటానని మృణాల్ తెలిపింది. ఇక త్వరలో ‘డెకాయిట్’ సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక స్వీట్ షాక్‌లా ఉంటుందని, తన పాత్ర పూర్తిగా కొత్తగా, ఊహించని విధంగా ఉంటుందని మృణాల్ ధీమాగా వ్యాక్తం చేస్తోంది.