ప్రముఖ భారతీయ ప్రకటనల సృష్టికర్త పియూష్ పాండే (70) కన్నుమూశారు. శుక్రవారం ప్రముఖ అడ్వర్టైజింగ్ లెజెండ్ పియూష్ పాండే చనిపోయినట్లుగా స్నేహితులు వెల్లడించారు. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ కోసం రూపొందించిన ‘‘అబ్ కీ బార్.. మోడీ సర్కార్’’ అనే నినాదం మార్మోగింది. ఈ నినాదంతో పియూష్ పాండే గుర్తింపు పొందారు. అప్పట్లో ఈ రాజకీయ నినాదం చాలా పాఫులర్ అయింది.
అలాగే క్యాడ్‌బరీ ‘కుచ్ ఖాస్ హై’, ఆసియన్ పెయింట్స్ ‘హర్ ఖుషీ మే రంగ్ లే’, వొడాఫోన్ ఐకానిక్ పగ్ యాడ్ వరకు ఎన్నో యాడ్స్ గుర్తింపు పొందాయి. పాండే ఆలోచనలు భారతీయ పాప్ సంస్కృతిలో నాటుకుపోయాయి.

పాండే.. ఓగిల్వీ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేశారు. 2024లో LIA లెజెండ్ అవార్డు, 2016లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. పాండేది సన్‌లైట్ డిటర్జెంట్ ప్రింట్ ప్రకటన మొదటిది. చిరస్మరణీయ వాణిజ్య రచనల్లో అమితాబ్ బచ్చన్‌తో పోలియో అవగాహన ప్రచారం, ఫెవిక్విక్ ‘‘తోడో నహిన్, జోడో’’, పాండ్స్ గూగ్లీ వూగ్లీ వూష్, వొడాఫోన్, గుజరాత్ టూరిజం కోసం ప్రచారాలు, క్యాన్సర్ పేషెంట్స్ అసోసియేషన్ కోసం ధూమపాన వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు బంగారం ధరలు ఇలా..!
పియూష్ పాండే మృతి పట్ల కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ప్రకటనల ప్రపంచంలో ఒక దృగ్విషయం’’గా అభివర్ణించారు. ‘‘పూడ్చలేని లోతైన శూన్యతను వదిలివేస్తాడు. అతని కుటుంబం, స్నేహితులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.’’ అని పియూష్ గోయల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘‘నా ప్రాణ స్నేహితుడు పియూష్ పాండే లాంటి మేధావిని కోల్పోవడం నాకు చాలా బాధగా ఉంది. భారతదేశం ఒక గొప్ప ప్రకటనా మనస్సును మాత్రమే కాకుండా నిజమైన దేశభక్తుడిని, మంచి పెద్దమనిషిని కోల్పోయింది. ఇప్పుడు స్వర్గం మిలే సుర్ మేరా తుమ్హారా పాటకు నృత్యం చేస్తుంది.’’ అని సన్నిహిత మిత్రుడు సుహెల్ సేథ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 1988లో జాతీయ సమైక్యత ప్రచారం కోసం పాండే పాడిన ‘‘మిలే సుర్ మేరా తుమ్హారా’’ అనే దేశభక్తి గీతాన్ని సుహెల్ సేథ్ ప్రస్తావిస్తూ ఈ మాటలు అన్నారు.
ఇది కూడా చదవండి: Kerala: ‘అత్యంత పేదరిక రహిత’ రాష్ట్రంగా కేరళ.. ప్రకటించనున్న సీఎం పినరయి