మలేషియాలో జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ వెళ్లకపోవడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఆ సదస్సుకు ట్రంప్ రావడంతోనే మోడీ వెళ్లడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ట్రంప్ నుంచి తప్పించుకునేందుకే ఈ సమావేశానికి వెళ్లడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాజస్థాన్‌లోని భిల్వారాలోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఘర్షణ చోటుచేసుకుంది. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) ఛోటు లాల్ శర్మ.. పెట్రోల్ పంప్ కార్మికుడి చెంపదెబ్బ కొట్టారు. అనంతరం కార్మికులు కూడా ఎదురు తిరిగి ప్రతి దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత కొద్దిరోజులుగా పరుగులు పెట్టిన పసిడి ధరలు రెండు రోజులుగా తగ్గు ముఖం పట్టాయి. దీంతో బంగారం ప్రియులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. గురువారం తులం గోల్డ్‌పై రూ. 810 తగ్గగా.. కిలో వెండిపై రూ.1,000 తగ్గింది.
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఓటరు సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టింది.
దీపావళి తర్వాత స్టాక్ మార్కెట్లో కొత్త జోష్ కనిపిస్తోంది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ మాత్రం కళకళలాడుతోంది. గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి.
మొత్తానికి బీహార్ విపక్ష కూటమిలో చోటుచేసుకున్న సంక్షోభానికి తెర పడింది. కూటమి పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. అశోక్ గెహ్లాట్ జరిపిన దైత్యం విజయవంతం అయింది. దీంతో ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ అభ్యర్థిత్వాన్ని అన్ని పార్టీలు అంగీకరించాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఇండియా కూటమి పార్టీలు సంయుక్త ప్రెస్‌మీట్ నిర్వహించి ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నారు.
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈజిప్టు వేదికగా జరిగిన ఈ సమావేశానికి ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినా మోడీ వెళ్లలేదు. తాజాగా మలేషియా వేదికగా అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశానికి కూడా ప్రధాని మోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది.
టెక్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ(27)పై ఐదుగురు సభ్యులతో కూడిన బృందం సామూహిక అత్యాచారానికి పాల్పడింది. అనంతరం ఇంట్లో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. నిందితులు.. మహిళను బెదిరించి సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా ఇంట్లో నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.25,000 నగదు ఎత్తుకెళ్లారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. రోహిణి ప్రాంతంలో నలుగురు గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. సిగ్మా గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ సహా నలుగురు గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. ఈ నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లుగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తెలిపింది.
బెంగళూరులో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో లివ్-ఇన్ జంట అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆనేకల్‌లోని కల్లబాలులోని ఓ ఇంట్లో శవాలుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.