దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సురీడు సుర్రుమంటున్నాడు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. భానుడు భగభగమండిపోతున్నాడు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ గురువారం పశ్చిమబెంగాల్లోని కూచ్ బీహార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ఈసారి అమేథీలో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారంటూ దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేపింది. రాహుల్ గాంధీనే పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. తీరా.. కాంగ్రెస్ తొలి జాబితా వెలువడగానే ఆ ఉత్కంఠ వీడిపోయింది.
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీజేపీ మహిళా అభ్యర్థులపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో కోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును రోస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది.
జర్మనీని ఆఫ్రికా దేశం బోట్స్వానా తీవ్రంగా హెచ్చరించింది. జర్మనీ ముచ్చటపడితే 20 వేల ఏనుగులను గిఫ్ట్‌గా ఇస్తామని బోట్సువానా అధ్యక్షుడు మోక్వీట్సీ మసిసి హెచ్చరించారు.
తీహార్ జైలు నుంచి విడుదలైన ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ నేరుగా కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. వచ్చి రాగానే సునీతా కేజ్రీవాల్‌కు నమస్కరించారు. అనంతరం ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ శ్రేణులకు ప్రధాని మోడీ కీలక సందేశం ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలవాలని.. నిర్భయంగా ఓట్లు వేసేలా వారిని ప్రోత్సహించాలని కోరారు.