Delhi: సునీతా కేజ్రీవాల్‌ను కలిసిన సంజయ్ సింగ్ దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీహార్ జైలు నుంచి విడుదలైన ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ నేరుగా కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. వచ్చి రాగానే సునీతా కేజ్రీవాల్‌కు నమస్కరించారు. అనంతరం ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సంజయ్ సింగ్ దంపతులు.. సునీతా కేజ్రీవాల్‌తో సమావేశం అయ్యారు. బుధవారం సాయంత్రమే సంజయ్ సింగ్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు దగ్గర ఆప్ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున స్వాగతం పలికారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దాదాపు 6 నెలల పాటు సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. అయితే మంగళవారం ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ట్రయిల్ కోర్టుకు కూడా బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బుధవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చారు. ఇదే కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఇదే జైల్లో ఉన్నారు. ఆయనకు ఇంకా బెయిల్ లభించలేదు. ఇక లిక్కర్ కేసులో ఇటీవలే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఉంది. గురువారం తీర్పు రానుంది.
Also Read
ఇటీవల జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ కూడా సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి భర్తల అరెస్ట్ పరిణామాలపై చర్చించారు. కలిసి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఇండియా కూటమి ఢిల్లీ రాంలీలా మైదానంలో కేజ్రీవాల్‌కు మద్దతుగా మహా ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు.. కేంద్రంపై ధ్వజమెత్తారు.
#WATCH | AAP MP Sanjay Singh meets Delhi CM Arvind Kejriwal's wife, Sunita Kejriwal, at the CM's residence
Singh after his release from Tihar Jail on bail first visited CM Kejriwal's residence pic.twitter.com/nJUB6BSAnZ
— ANI (@ANI) April 3, 2024
#WATCH | Delhi: AAP MP Sanjay Singh meets party leaders.
He has been released from Tihar Jail on bail in the Delhi excise policy case. pic.twitter.com/0t7qbAv0Qx
— ANI (@ANI) April 3, 2024
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!