కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేశారు. అంతకముందు భారీ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ వెంట ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
క్యాష్ ఫర్ క్వారీ ఆరోపణలపై గతేడాది లోక్‌సభ నుంచి బహిష్కరించబడిన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మోయిత్రా(49)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది.
సార్వత్రిక ఎన్నికల వేళ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీపై గత కొంతకాలంగా నాన్చుతూ వస్తున్నారు. పోటీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఐటీ శాఖ నుంచి పలు ట్యాక్స్ డిమాండ్ నోటీసులు అందుకున్న జొమాటోకి తాజాగా ఢిల్లీలోని సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ నుంచి రూ.184.18 కోట్ల జీఎస్టీ నోటీసు జారీ అయింది.
సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సెన్సేషనల్ ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సంచలన ప్రకటన చేశారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల తీరును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల అధికారుల తీరుపై ఈసీ కొరడా ఝుళిపించింది.