సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నేతలంతా హస్తం పార్టీని వీడుతున్నారు. బుధవారం బాక్సర్ విజేందర్ సింగ్ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి పువ్వు పార్టీలో చేరారు. తాజాగా గురువారం కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కూడా పార్టీకి రాజీనామా చేసి కాషాయ గూటికి చేరారు. ఢిల్లీలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే.. వల్లభ్ మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి: Mudragada Padmanabham: జనసేనాని పవన్ కల్యాణ్‌పై ముద్రగడ ఫైర్
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కొద్ది సేపట్లోనే బీహార్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అనిల్ శర్మతో కలిసి వల్లభ్ బీజేపీలో చేరారు. రెండు పేజీల రాజీనామా లేఖను రాస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. కాంగ్రెస్‌లోని పదవులకు.. ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఇక లేఖలో కాంగ్రెస్ తీరును తూర్పారాబట్టారు. కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం లేదని విమర్శించారు. ఈ విధంగా పార్టీ ముందుకు సాగడం తనకు ఇబ్బందికరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: CM YS Jagan: డ్రైవర్‌కు టికెట్ ఇస్తే తప్పేంటి?.. లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం ముఖాముఖి
2023లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయపూర్ నియోజకవర్గం నుంచి వల్లభ్ పోటీ చేసి విఫలమయ్యారు. దాదాపు 32,000 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2019లో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ తూర్పు నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆ విధంగా వల్లభ్ రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ వైఖరి ఏ మాత్రం సరిగ్గా లేదని వల్లభ్ ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Mrunal Thakur: రోజూ ఏడ్చేదాన్ని.. తెలుగు సినిమాల్లో నటించొద్దనుకున్నా: మృణాల్ ఠాకూర్
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. అటు తర్వాత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న చివరి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.
कांग्रेस पार्टी आज जिस प्रकार से दिशाहीन होकर आगे बढ़ रही है,उसमें मैं ख़ुद को सहज महसूस नहीं कर पा रहा.मैं ना तो सनातन विरोधी नारे लगा सकता हूं और ना ही सुबह-शाम देश के वेल्थ क्रिएटर्स को गाली दे सकता.इसलिए मैं कांग्रेस पार्टी के सभी पदों व प्राथमिक सदस्यता से इस्तीफ़ा दे रहाहूं pic.twitter.com/Xp9nFO80I6
— Prof. Gourav Vallabh (@GouravVallabh) April 4, 2024