Kavitha: కవితకు లభించని ఊరట.. బెయిల్‌పై తీర్పు రిజర్వ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో కోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును రోస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్‌పై గురువారం న్యాయస్థానం విచారించింది. కవిత, ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు నియామకం
Also Read
తన కుమారులకు పరీక్షలు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కవిత కోరారు. పిటిషన్ విచారించిన కోర్టు.. సోమవారినికి తీర్పును రిజర్వ్ చేసింది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై మాత్రం ఏప్రిల్ 20న విచారించనుంది. ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా తీహార్ జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీ అనంతరం కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: Sandeshkhali: మీరు కళ్లు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం చీకటి కాదు.. మమతా సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం..
బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని… ఢిల్లీ మద్యం కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారని తెలిపారు. ఆమె తన ఫోన్ డేటాను డిలీట్ చేశారని.. దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని ఈడీ పేర్కొంది. పది ఫోన్లు ఇచ్చినా అన్నీ ఫార్మాట్ చేసే ఇచ్చారని.. నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను కవిత ఫార్మాట్ చేశారని తెలిపింది. నిందితులంతా వందల డిజిటల్ డివైజ్‌లను ధ్వంసం చేశారని ఈడీ వెల్లడించింది. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారన్నారు. అయినా ఆమె చిన్న కుమారుడు ఒంటరి కాదని.. సోదరుడు, కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని ఈడీ స్పష్టంచేసింది. కుమారుడి పరీక్షలు కూడా కొన్ని పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని ఈడీ తెలిపింది. వాదనలు విన్నాక సోమవారానికి రిజర్వ్ చేసింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!